tickets sales
-
భారత్, పాక్ వరల్డ్‌కప్ మ్యాచ్ టికెట్లు ఇచ్చే డేట్ వచ్చేసింది..!
క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వన్డే వరల్డ్‌కప్-2023 టికెట్ల విక్రయానికి సంబంధించిన తేదీలను ఇవాళ (ఆగస్ట్ 15) ప్రకటించింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల విక్రయ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దశ ఇదివరకే ప్రారంభం కాగా, ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ ప్రారంభమవుతుందని వెల్లడించింది. వరల్డ్‌కప్ మొత్తంలో అత్యంత ఆసక్తికరమైన దాయాదాల సమరానికి సంబంధించిన టికెట్ల విక్రయం సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. 🎟️ #CWC23 Ticket sales 🔹 25 August: Non-India warm-up matches and all non-India event matches 🔹 30 August: India matches at Guwahati and Trivandrum 🔹 31 August: India matches at Chennai, Delhi and Pune 🔹 1 September: India matches at Dharamsala, Lucknow and Mumbai 🔹 2… pic.twitter.com/GgrWMoIFfA — ICC (@ICC) August 15, 2023 టికెట్ల అమ్మకాల ప్రారంభ తేదీల వివరాలు.. ఏయే మ్యాచ్‌లు.. ఆగస్ట్ 25: నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు మరియు అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు ఆగస్టు 30: గౌహతి, త్రివేండ్రంలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు ఆగస్టు 31: చెన్నై, ఢిల్లీ, పూణేలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు సెప్టెంబర్ 1: ధర్మశాల, లక్నో, ముంబైలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు సెప్టెంబర్ 2: బెంగళూరు, కోల్‌కతాలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు సెప్టెంబర్ 3: అహ్మదాబాద్‌లో టీమిండియా ఆడే మ్యాచ్ (భారత్ వర్సెస్ పాకిస్థాన్, అక్టోబర్ 14) సెప్టెంబర్ 15: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు కాగా, ఆగస్ట్ 15 నుంచి www.cricketworldcup.com వెబ్సైట్లో వరల్డ్ కప్ అప్డేట్స్ గురించి తెలుసుకోవచ్చని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో(అక్టోబర్ 8న) ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరుగనుంది. -
IND VS AUS 2nd ODI: హాట్‌కేకుల్లా ‘విశాఖ’ వన్డే టికెట్ల విక్రయం
విశాఖ స్పోర్ట్స్: భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేకు సంబంధించిన టికెట్లు మంగళవారం హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియం సామర్థ్యం 27 వేలు కాగా.. పేటీఎం సంస్థ ఈ నెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ.6 వేల వరకు వివిధ విభాగాల్లో 70 శాతం టికెట్లను ఆన్లైన్లో విక్రయించింది. మిగిలిన 30 శాతం టికెట్లను స్థానిక అభిమానులను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లలో ఏసీఏ నిర్వాహక కమిటీ మంగళవారం అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు ‘క్యూ’లు కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, సిరీస్‌లో తొలి వన్డే 17వ తేదీన ముంబైలో, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది. -
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ వన్డే.. టికెట్ల విక్రయం ఎప్పుడు, ఎలా అంటే..?
IND VS NZ 1st ODI: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిశాక, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కివీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 18న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే, 21న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. అనంతరం జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి, టీ20లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం, మ్యాచ్‌కు ముందు షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో (పేటీయం) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్లో టికెట్లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39,112 అయితే, 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు. -
అంతా పారదర్శకమే.. టికెట్ల విక్రయాలపై అజహర్ స్పష్టీకరణ
ఉప్పల్/సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అన్ని రకాలుగా పారదర్శకత పాటించామని, తమ వైపునుంచి టికెట్లు బ్లాక్ అయ్యే అవకాశమే లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో నెలకొన్న గందరగోళంపై ఆయన ఈ మేరకు స్పందించారు. జింఖానా మైదానంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, మ్యాచ్ రోజున ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించాం. ఇందులో నేరుగా హెచ్‌సీఏ ప్రమేయం లేదు. ఆన్లైన్ టికెట్లను బ్లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అని చెప్పారు. ఆన్లైన్లో 11,450, 3,000 చొప్పున రెండుసార్లు, ఆఫ్‌లైన్‌లో 2,100 టికెట్లు విక్రయించామని చెప్పారు. తప్పనిసరిగా ఇవ్వాల్సిన స్పాన్సర్లు తదితరులకు 6 వేల టికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారమే తమ క్లబ్ కార్యదర్శులకూ కాంప్లిమెంటరీలు ఇచ్చామని అజహర్ పేర్కొన్నారు. సజావుగా నిర్వహించేందుకు... హెచ్‌సీఏలో కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆన్లైన్లో సమీక్ష నిర్వహించింది. ఇందులో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, ఏసీబీ డైరెక్టర్ అంజనీకుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్ పాల్గొన్నారు. మ్యాచ్‌ను సజావుగా నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని జస్టిస్ కక్రూ తెలిపారు. మ్యాచ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు కమిటీ హెచ్‌సీఏకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. టి–20 టికెట్లలో భారీ కుంభకోణం: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హఫీజ్‌పేట్: హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే టి–20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాలతో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రంగంలోకి దిగి, హెచ్‌సీఏతో కుమ్మక్కై టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారన్నారు. మియాపూర్ మదీనాగూడలోని కిన్నెర గ్రాండ్ హోటల్లో శుక్రవారం జరిగిన ప్రవాస్ యోజన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం ఓ ఆన్లైన్ సంస్థకు అప్పజెప్పి, అర్ధరాత్రి 10 గం.కు అమ్మకాలు ఓపెన్ చేసి 20 నిమిషాల్లో 39 వేల టికెట్లు అమ్ముడుపోయాయనడం విడ్డూరమన్నారు. రూ.800 టికెట్‌ను బ్లాక్‌లో రూ.8,000 నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. -
Sakshi Cartoon 24-09-2022
-
IND VS PAK: నిమిషాల్లో అమ్ముడుపోయిన టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర
క్రికెట్లో దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎప్పటిలాగే మరోసారి ఎగబడ్డారు. ఆసియా కప్-2022లో భాగంగా ఆగస్ట్ 28న జరుగనున్న భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని నిన్న (ఆగస్ట్ 15) ప్రారంభించగా, యధాతథంగా నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. టోర్నీ నిర్వహకులు యూఏఈలో అత్యంత ప్రజాదరణ కలిగిన ప్లాటినంలిస్ట్ (Platinumlist) అనే వెబ్‌సైట్‌కు టికెట్ల అమ్మకపు బాధ్యతలు అప్పజెప్పగా.. ఆన్లైన్ సేల్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో (రాత్రి 7:30 గంటలకు) ఏకంగా 7.5 లక్షల మంది అభిమానులు సైట్‌పై ఒకేసారి దండయాత్ర చేశారు. దీంతో సైట్ క్రాషై టికెట్ల విక్రయానికి కాసేపు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు నిర్వహకులు 'క్యూ' (ఆన్లైన్) పద్దతిని పాటించారు. అయినప్పనటికీ చాలామంది అభిమానులుకు నిరాశే ఎదురైంది. టికెట్ల అమ్మకాల విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిబంధనలు పాటించలేదని టికెట్ ఆశావహులు ఆరోపిస్తున్నారు. టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్ 2022లో భాగంగా అక్టోబర్ 28న జరుగనున్న భారత్-పాక్ మ్యా్చ్కు సంబంధించిన టికెట్లు కూడా ఇలాగే ఒక్కరోజులోనే ఖతమైన విషయం తెలిసిందే. చదవండి: విరాట్ కోహ్లి ఫామ్‌పై సౌరవ్ గంగూలీ ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్స్ -
టోక్యో ఒలింపిక్స్ చూస్తారా...!
టోక్యో: జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టోక్యో ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా తిలకించాలనుకునే ప్రేక్షకుల కోసం టికెట్ కబుర్లను ఆర్గనైజర్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే ఈ పోటీల కోసం ఆతిథ్య ఏర్పాట్లన్నీ తుదిదశకు చేరుకున్నాయి. దీంతో టికెట్ల విక్రయానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. 33 క్రీడాంశాల్లో 339 విభాగాల్లో జరిగే ఈవెంట్లను తిలకించేందుకు 78 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచారు. వచ్చే నెల నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. సాధారణ టికెట్ల ధర రూ.1550 (2500 జపాన్ యెన్లు) నుంచి మొదలవుతుంది. అంగరంగవైభవంగా జరిగే ప్రారంభోత్సవాన్ని ప్రత్యేకంగా దగ్గరి నుంచి చూడాలనుకుంటే మాత్రం రూ. లక్షా 86 వేలు (3 లక్షల యెన్లు) వెచ్చించాల్సి ఉంటుంది. పురుషుల 100 మీటర్ల ఫైనల్‌ను దగ్గరి నుంచి వీక్షించాలనుకుంటే రూ.80,612 (లక్షా 30 వేల యెన్లు) చెల్లించాలి. ఇక మిగతా టికెట్లన్నీ రూ.4960 (8000 యెన్లు)కు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. 2020వ సంవత్సరంలో మెగా ఈవెంట్ జరుగుతుండటంతో జపాన్ వాసులకు ప్రత్యేకంగా 2020 యెన్లతో (రూ.1250) టికెట్లను విక్రయిస్తారు. ఇవి మే 9 నుంచి 28 వరకు లాటరీ పద్ధతిలో అందజేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ వీక్షకుల కోసం జూన్ 15 నుంచి అమ్మకాలు చేపడతారు. ఎవరైనా సరే ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మాత్రం తప్పనిసరి. జ్టి్టpట://్టజీఛిజ్ఛ్టు.్టౌజుyౌ2020.ౌటజ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. 78 లక్షల టికెట్లలో 70 నుంచి 80 శాతం టికెట్లను జపాన్ వాసులకు కేటాయించారు. వచ్చే ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయి. -
ఏడాదికి ముందే 2015 ప్రపంచ కప్ టిక్కెట్ల విక్రయం
2015లో జరిగే ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ టిక్కెట్లను సరిగ్గా ఏడాది ముందే విక్రయానికి ఉంచనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి టిక్కెట్లను అమ్మనున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ప్రపంచ కప్‌నకు ఆతిథ్యమిస్తున్నాయి. ప్రపంచ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు దాదాపు పదిలక్షల మందికి పైగా అభిమానులు హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక టీవీల ద్వారా వందకోట్లమందికి పైగా వీక్షిస్తారని అంచనా వేశారు. ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌లకు పిల్లల కోసం టిక్కెట్లను ప్రత్యేకంగా విక్రయించనున్నారు. కనీస ధర 320 రూపాయల నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక పెద్దల టిక్కెట్లను కనీస ధర 1300 రూపాయల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. కుటుంబంతో కలసి వచ్చే వారి కోసం మరింత తక్కువ ధరతో టిక్కెట్లను విక్రయించనున్నారు. నలుగురు కుటుంబ సభ్యులందరికీ కలిపి కనీస ధర 3200 రూపాయల నుంచి అందుబాటులో ఉంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌నకు ఆతిథ్యమివ్వనుండటంతో అభిమానుల నుంచి మంచి స్పందన ఉంటుందని భావిస్తున్నారు.