
క్రికెట్‌లో దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎప్పటిలాగే మరోసారి ఎగబడ్డారు. ఆసియా కప్-2022లో భాగంగా ఆగస్ట్ 28న జరుగనున్న భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని నిన్న (ఆగస్ట్ 15) ప్రారంభించగా, యధాతథంగా నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
టోర్నీ నిర్వహకులు యూఏఈలో అత్యంత ప్రజాదరణ కలిగిన ప్లాటినంలిస్ట్ (Platinumlist) అనే వెబ్‌సైట్‌కు టికెట్ల అమ్మకపు బాధ్యతలు అప్పజెప్పగా.. ఆన్‌లైన్ సేల్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో (రాత్రి 7:30 గంటలకు) ఏకంగా 7.5 లక్షల మంది అభిమానులు సైట్‌పై ఒకేసారి దండయాత్ర చేశారు.
దీంతో సైట్ క్రాషై టికెట్ల విక్రయానికి కాసేపు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు నిర్వహకులు 'క్యూ' (ఆన్‌లైన్) పద్దతిని పాటించారు. అయినప్పనటికీ చాలామంది అభిమానులుకు నిరాశే ఎదురైంది. టికెట్ల అమ్మకాల విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిబంధనలు పాటించలేదని టికెట్ ఆశావహులు ఆరోపిస్తున్నారు.
టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్ 2022లో భాగంగా అక్టోబర్ 28న జరుగనున్న భారత్-పాక్ మ్యా్‌చ్‌కు సంబంధించిన టికెట్లు కూడా ఇలాగే ఒక్కరోజులోనే ఖతమైన విషయం తెలిసిందే.
చదవండి: విరాట్ కోహ్లి ఫామ్‌పై సౌరవ్ గంగూలీ ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్స్