ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ సొంత గడ్డపై ఓ ఐసీసీ ఈవెంట్ జరగనుండడంతో విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ టోర్నీలో పాల్గోనందుకు పాక్‌కు టీమిండియా వెళ్లడంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతునే ఉంది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత 10 ఏళ్ల పాక్-భారత జట్ల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్ వంటి ఈవెంట్‌లో తలపడతున్నాయి. ఆసియాకప్-2023కు పాక్‌నే ఆతిథ్యమిచ్చింది.
కానీ భారత్ మాత్రం పాక్‌కు వెళ్లలేదు. దీంతో ఆ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్‌లన్నింటని శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని హైబ్రిడ్ మోడల్‌లోనే బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్‌కు వెళ్లేది లేదని ఐసీసీకి భారత క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పీసీబీ మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుతో ఉంది.
పీసీబీ ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి పంపించింది. దీనిలో భాగంగా ఫైనల్ మ్యాచ్‌కు లాహోర్‌ను వేదికగా నిర్ణయించింది. అయితే తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
భారత్ ఒకే వేళ ఫైనల్ చేరితే వేదిక దుబాయ్‌కి మారే అవకాశం ఉందని ‘టెలిగ్రాఫ్’ తమ నివేదికలో పేర్కొంది. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. పాక్‌కు వెళ్లకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే టీమిండియా మ్యాచులన్నీ యూఏఈలో నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఐసీసీ నూతన చైర్మెన్‌గా జై షా ఎంపికైన విషయం విధితమే.
Comments
Please login to add a commentAdd a comment