సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు విరాట్ కోహ్లి 93 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా ధావన్ 95 ఇన్నింగ్స్‌లో సాధించి మాజీ కెప్టెన్ గంగూలీ(105 ఇన్నింగ్స్‌ల)ని అధిగమించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇక ఓవరాల్‌గా ఆరో బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ నమోదు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా (81 ఇన్నింగ్స్‌ల్లో) తొలి స్థానంలో ఉండగా రిచర్డ్స్(88), జోరూట్(91), విరాట్ కోహ్లి(93), వార్నర్(93)లు ముందు వరుసలో ఉన్నారు.
శిఖర్ ధావన్ మరో ఘనత
Published Sun, Dec 17 2017 7:25 PM | Last Updated on Sun, Dec 17 2017 7:28 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment