విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మశక్యంకాని క్యాచ్‌ను అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవిండ్ క్యాచ్‌ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 9.2వ ఓవర్‌లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టాడు. వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే.
Hardik Pandya dismissed for 1. what a catch by Smith#HardikPandya #INDvsAUS #ViratKohli #SuryakumarYadav
— Rajkumar (@Rajkumar0507) March 19, 2023
India 49/5 now. pic.twitter.com/idE6IjpaSR
అలాంటిది స్మిత్ సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్మిత్‌కు ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు కొత్త కానప్పటికీ, ఈ క్యాచ్ మాత్రం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. స్మిత్ సెన్సేషనల్ డైవింగ్ క్యాచ్‌ను సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇది చూసి స్మిత్‌ను వ్యతిరేకించే వారు సైతం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే, ఆసీస్‌తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1), జడేజా (16) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (31) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment