sensational catch
-
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న టీమిండియా ప్లేయర్.. వీడియో
మహిళల క్రికెట్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 27) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓ సెన్సేషన్ క్యాచ్ నమోదైంది. టీమిండియా ప్లేయర్ రాధా యాదవ్ నమ్మశక్యం కాని రీతిలో ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టింది. ప్రియా మిశ్రా బౌలింగ్‌లో బ్రూక్ హ్యాలీడే ఆడిన షాట్‌ను రాధా యాదవ్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. నెటిజన్లు ఈ క్యాచ్‌ను గతంలో యువరాజ్ సింగ్ పట్టిన ఓ సెన్సేషన్ క్యాచ్‌తో పోలుస్తున్నారు.RADHA YADAV WITH A STUNNER. 🤯pic.twitter.com/CuvFs7nAc3— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 41 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 191/4గా ఉంది. సుజీ బేట్స్ (58), జార్జియా ప్లిమ్మర్ (41), లారెన్ డౌన్ (3), బ్రూక్ హ్యాలీడే (8) ఔట్ కాగా.. సోఫీ డివైన్ (60), మ్యాడీ గ్రీన్ (19) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, ప్రియా మిశ్రా, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఎల్లిస్ పెర్రీ ఊచకోత.. సిడ్నీ సిక్సర్స్ బోణీ విజయం -
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. నమ్మశక్యం కాని రీతిలో..!
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు, జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అందుకున్నాడు. నిన్న (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో సూపర్ జెయింట్స్ ఓపెనర్ బ్రీట్జ్కీ కొట్టిన షాట్‌ను రొమారియో షెపర్డ్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌గా మలిచాడు. ROMARIO SHEPHERD.... THAT'S AN ABSOLUTE SCREAMER...!!! 🤯 pic.twitter.com/riWEILas3w — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 షెపర్డ్ కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. ఇది చూసిన వారు తాము చూస్తున్నది నిజమేనా అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. బౌలర్ నండ్రే బర్గర్ అయితే ఈ క్యాచ్‌కు చూసి కొద్దిసేపటి వరకు అలాగే షాక్‌లో ఉండిపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అలరించినప్పటికీ ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు సూపర్ జెయింట్స్ చేతిలో 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్వల్ప ఛేదనలో సూపర్ కింగ్స్ బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలమై ఓటమిని కొనితెచ్చుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (64) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. లిజాడ్ విలియమ్స్ (4/26) సూపర్ జెయింట్స్ పతనాన్ని శాశించాడు. అనంతరం రీస్ టాప్లే (3/19), రిచర్డ్ గ్లీసన్ (2/22), కేశవ్ మహారాజ్ (2/17) చెలరేగడంతో సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది. రీజా హెండ్రిక్స్ (38), మొయిన్ అలీ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 16) ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ తలపడనున్నాయి. -
Viral Video: శతాబ్దపు అత్యుత్తమ క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్
విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మశక్యంకాని క్యాచ్‌ను అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవిండ్ క్యాచ్‌ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టాడు. వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే. Hardik Pandya dismissed for 1. what a catch by Smith#HardikPandya #INDvsAUS #ViratKohli #SuryakumarYadav India 49/5 now. pic.twitter.com/idE6IjpaSR — Rajkumar (@Rajkumar0507) March 19, 2023 అలాంటిది స్మిత్ సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్మిత్‌కు ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు కొత్త కానప్పటికీ, ఈ క్యాచ్ మాత్రం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. స్మిత్ సెన్సేషనల్ డైవింగ్ క్యాచ్‌ను సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి స్మిత్‌ను వ్యతిరేకించే వారు సైతం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1), జడేజా (16) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (31) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. -
ఆహా.. ఏమా క్యాచ్..! అచ్చం పక్షిలా గాల్లోకి ఎగురుతూ..
Windies Player Teddy Bishop Superman Catch: అండర్ 19 ప్రపంచ కప్ 2022లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ యువకెరటం టెడ్డీ బిషప్ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అమోరీ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్లో స్కాట్లాండ్ బ్యాటర్ రాబర్ట్సన్ స్లిప్ దిశగా ఆడగా, అక్కడే కాపు కాసిన బిషప్.. అచ్చం పక్షిలా గాల్లోకి ఎగురుతూ సూపర్ మ్యాన్ క్యాచ్ అందుకున్నాడు. ఈ విన్యాసాన్ని చూసి మైదానంలోని సహచరులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం అవాక్కయ్యింది. Reflexes 💯This extremely sharp take at first slip by Teddy Bishop has been voted @Nissan Play of the Day winner after Day 4 👏 pic.twitter.com/DLKDPqVV3F— ICC (@ICC) January 18, 2022 ఆహా.. ఏమా క్యాచ్.. అంటూ సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సూపర్ మ్యాన్ క్యాచ్.., స్పైడర్ మ్యాన్ దొరికాడు.., జూనియర్ జాంటీ రోడ్స్.., అథ్లెటిజం విండీస్ క్రికెటర్ల రక్తంలో ఉందంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో బిషప్ మరో సెన్సేషనల్ క్యాచ్ అందుకోవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ(23 నాటౌట్) రాణించి తన జట్టును గెలిపించాడు. చదవండి: U19 World Cup: ఐర్లాండ్‌తో మ్యాచ్... ఇండియా క్వార్టర్స్ చేరేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి సెన్సేషనల్ క్యాచ్!
బెంగళూరు: ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో ఆదివారం చినస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది. కోహ్లి పట్టిన సెన్సేషనల్ క్యాచ్ అభిమానులతో సహా పుణె ఆటగాళ్లను విస్మయానికి గురిచేసింది. ఊహించని రీతిలో బంతిని అందుకుని దూకుడుమీదున్న పుణె ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని పెవిలియన్ దారి పట్టించాడు. 9వ ఓవర్ లో పవన్ నేగి బౌలింగ్ లో త్రిపాఠి కొట్టిన బంతిని ఎడమవైపుకు డైవ్ చేసి కోహ్లి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. బ్యాట్స్ మన్ అలా షాట్ కొట్టాడో లేదో ఆర్సీబీ కెప్టెన్ క్యాచ్ పట్టడం, వెంటనే బంతిని గాల్లోకి విసిరేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. కష్టసాధ్యమైన క్యాచ్ ను ఊహించనిరీతిలో పట్టడంతో త్రిపాఠి కొద్ది నిమిషాల పాటు విస్మయానికి గురయ్యాడు. ఆశ్చర్యంగా చూస్తూనే పెవిలియన్ కు చేరాడు. మ్యాచ్ ఓడినప్పటికీ తనదైన ఆటతీరుతో అభిమానులకు కోహ్లి వినోదం పంచాడు. ‘నేను పట్టిన అరుదైన క్యాచుల్లో ఇది కూడా ఒకటి. ట్రైనింగ్ లో నేను తీసుకున్న శిక్షణ ఇక్కడ ప్రతిఫలించింద’ని మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి అన్నాడు. -
వారెవ్వా.. వాటే సెన్సేషనల్ క్యాచ్!
-
వారెవ్వా.. వాటే సెన్సేషనల్ క్యాచ్!
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్వెల్ తెలుసు కదా! ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి.. వార్తల్లో నిలిచిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్.. తాజాగా ఓ మెరుపు క్యాచ్‌తో అభిమానుల్ని విస్మయంలో ముంచెత్తాడు. మెటాడర్ కప్‌లో భాగంగా విక్టోరియా బూష్ రేంజర్స్, వారియర్స్ మధ్య శనివారం వన్డే మ్యాచ్ పెర్త్‌లో జరిగింది. వారియర్స్ బ్యాట్స్‌మన్ డీ ఆర్కీ షార్ట్ భారీ షాట్ కొట్టాడు. మాములుగా అయితే అది సిక్సర్ అయ్యేది. కానీ బౌండరీ వద్ద కాచుకొని నిలబడిన గ్లేన్ మాక్స్వెల్ అమాంతంలో గాలిలోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టాడు. ఇంతలో తాను బౌండరీ లైన్ మీద పడుతున్నట్టు అతనికి అర్థమైంది. అంతే రెప్పపాటులో బంతిని ఎదురుగా ఉన్న ఫీల్డర్ వైపు విసిరాడు. రెడీగా ఉన్న రాబ్ క్వినీ దానిని అందుకున్నాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌ను చూసి ప్రేక్షకులు స్టన్ అయ్యారు. బ్యాట్స్‌మన్ కూడా ఒకింత షాక్‌తో నిరాశగా వెనుదిరిగాడు. గ్లేన్ మెరుపు క్యాచ్‌ను చూసిన నెటిజన్లు అతని ప్రతిభపై సోషల్ మీడియాలో ప్రంశసల జల్లు కురిపిస్తున్నారు.