వారెవ్వా.. వాటే సెన్సేషనల్‌ క్యాచ్‌! | Glenn Maxwell sensational catch went viral | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. వాటే సెన్సేషనల్‌ క్యాచ్‌!

Published Sun, Oct 9 2016 5:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

వారెవ్వా.. వాటే సెన్సేషనల్‌ క్యాచ్‌!

వారెవ్వా.. వాటే సెన్సేషనల్‌ క్యాచ్‌!

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లేన్‌ మాక్స్‌వెల్‌ తెలుసు కదా! ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి.. వార్తల్లో నిలిచిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్‌.. తాజాగా ఓ మెరుపు క్యాచ్‌తో అభిమానుల్ని విస్మయంలో ముంచెత్తాడు.

మెటాడర్‌ కప్‌లో భాగంగా విక్టోరియా బూష్‌ రేంజర్స్‌, వారియర్స్‌ మధ్య శనివారం వన్డే మ్యాచ్‌ పెర్త్‌లో జరిగింది. వారియర్స్‌ బ్యాట్స్‌మన్‌  డీ ఆర్కీ షార్ట్‌ భారీ షాట్‌ కొట్టాడు. మాములుగా అయితే అది సిక్సర్‌ అయ్యేది. కానీ బౌండరీ వద్ద కాచుకొని నిలబడిన గ్లేన్‌ మాక్స్‌వెల్‌ అమాంతంలో గాలిలోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టాడు. ఇంతలో తాను బౌండరీ లైన్‌ మీద పడుతున్నట్టు అతనికి అర్థమైంది. అంతే రెప్పపాటులో బంతిని ఎదురుగా ఉన్న ఫీల్డర్‌ వైపు విసిరాడు. రెడీగా ఉన్న రాబ్‌ క్వినీ దానిని అందుకున్నాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌ను చూసి ప్రేక్షకులు స్టన్‌ అయ్యారు. బ్యాట్స్‌మన్‌ కూడా ఒకింత షాక్‌తో నిరాశగా వెనుదిరిగాడు. గ్లేన్‌ మెరుపు క్యాచ్‌ను చూసిన నెటిజన్లు అతని ప్రతిభపై సోషల్‌ మీడియాలో ప్రంశసల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement