
మహిళల క్రికెట్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 27) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓ సెన్సేషన్ క్యాచ్ నమోదైంది. టీమిండియా ప్లేయర్ రాధా యాదవ్ నమ్మశక్యం కాని రీతిలో ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టింది. ప్రియా మిశ్రా బౌలింగ్‌లో బ్రూక్ హ్యాలీడే ఆడిన షాట్‌ను రాధా యాదవ్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. నెటిజన్లు ఈ క్యాచ్‌ను గతంలో యువరాజ్ సింగ్ పట్టిన ఓ సెన్సేషన్ క్యాచ్‌తో పోలుస్తున్నారు.
RADHA YADAV WITH A STUNNER. 🤯pic.twitter.com/CuvFs7nAc3
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 41 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 191/4గా ఉంది. సుజీ బేట్స్ (58), జార్జియా ప్లిమ్మర్ (41), లారెన్ డౌన్ (3), బ్రూక్ హ్యాలీడే (8) ఔట్ కాగా.. సోఫీ డివైన్ (60), మ్యాడీ గ్రీన్ (19) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, ప్రియా మిశ్రా, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
చదవండి: ఎల్లిస్ పెర్రీ ఊచకోత.. సిడ్నీ సిక్సర్స్ బోణీ విజయం
Comments
Please login to add a commentAdd a comment