Windies Player Teddy Bishop Superman Catch: అండర్ 19 ప్రపంచ కప్ 2022లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ యువకెరటం టెడ్డీ బిషప్ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అమోరీ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్లో స్కాట్లాండ్ బ్యాటర్ రాబర్ట్సన్ స్లిప్ దిశగా ఆడగా, అక్కడే కాపు కాసిన బిషప్.. అచ్చం పక్షిలా గాల్లోకి ఎగురుతూ సూపర్ మ్యాన్ క్యాచ్ అందుకున్నాడు. ఈ విన్యాసాన్ని చూసి మైదానంలోని సహచరులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం అవాక్కయ్యింది.
Reflexes 💯
— ICC (@ICC) January 18, 2022
This extremely sharp take at first slip by Teddy Bishop has been voted @Nissan Play of the Day winner after Day 4 👏 pic.twitter.com/DLKDPqVV3F
ఆహా.. ఏమా క్యాచ్.. అంటూ సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సూపర్ మ్యాన్ క్యాచ్.., స్పైడర్ మ్యాన్ దొరికాడు.., జూనియర్ జాంటీ రోడ్స్.., అథ్లెటిజం విండీస్ క్రికెటర్ల రక్తంలో ఉందంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో బిషప్ మరో సెన్సేషనల్ క్యాచ్ అందుకోవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ(23 నాటౌట్) రాణించి తన జట్టును గెలిపించాడు.
చదవండి: U19 World Cup: ఐర్లాండ్‌తో మ్యాచ్... ఇండియా క్వార్టర్స్ చేరేనా?
Comments
Please login to add a commentAdd a comment