
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా భారత్, వెస్టీండ్‌స్‌ల మధ్య జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు నిరాశే మిగిలింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 321 పరుగులు సాధించింది. భారత్ తరఫున కోహ్లి 157 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగగా, అంబటి రాయుడు 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన విండీస్ జట్టు దాటిగా ఆడింది. 78 పరుగులకే మూడు వికెట్లు కొల్పోయిన విండీస్.. ఆ తర్వాత వేగం పెంచింది. హెట్‌మైర్(94), హోప్(123 నాటౌట్) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. హెట్‌మైర్ జౌటైన తర్వాత విండీస్ వికెట్లు కొల్పోయినప్పటికీ.. సెంచరీ సాధించిన హోప్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. అఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా హోప్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది.