Upul Tharanga
-
శ్రీలంక క్రికెట్లో కీలక పరిణామం.. సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌గా మాజీ కెప్టెన్
శ్రీలంక క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్ కమిటీని ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఏర్పాటు చేశారు. కొత్త కమిటీ నియామకం తక్షణమే అమలు వస్తోందని ఫెర్నాండో బుదవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ సెలక్షన్ కమిటీకి శ్రీలంక మాజీ వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్‌గా ఎంపికయ్యాడు. ఈ కమిటీలో తరంగతో పాటు మాజీ ఆటగాళ్లు అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు. ఉపుల్ తరంగ నేతృత్వంలోని ఈ సెలక్షన్ కమిటీ రెండేళ్ల పాటు శ్రీలంక జట్టు ఎంపికలో కీలకం కానుంది. జనవరిలో స్వదేశంలో జింబాబ్వేతో జరిగే సిరీస్‌కు జట్టు ఎంపికతో లంక కొత్త సెలక్షన్ కమిటీ ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా శ్రీలంక క్రికెట్లో ఉపుల్ తరంగాకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. ఓపెనర్‌గా తన జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఓవరాల్‌గా తరంగ మూడు ఫార్మాట్లలో శ్రీలంక తరపున 9వేలకు పైగా పరుగలు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆ దేశ క్రీడల శాఖ మంత్రి లంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. అయితే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని ఐసీసీ సస్పెండ్ చేసింది. అనంతరం ఐసీసీ లంక క్రికెట్ పై కొన్ని ఆంక్షలను సడలించడంతో ఆ జట్టు యధావిధిగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు గ్రీన్ సిగ్నిల్ లభించింది. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై? -
లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
రెండు మనుసుల కలయికతో.. ఇద్దరు మనుషులు పరస్పర నమ్మకంతో దాంపత్య జీవితంలో ముందుకు సాగితేనే ఆ బంధం నాలుగుకాలాల పాటు వర్ధిల్లుతుంది. భాగస్వాములలో ఏ ఒక్కరు పెళ్లినాటి ప్రమాణాలు తప్పినా ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ‘మూడో వ్యక్తి’ని తమ జీవితంలోకి ఆహ్వానించి ప్రాణంగా ప్రేమించిన పార్ట్నర్ను మోసం చేస్తే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలకరత్నె దిల్షాన్, ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ తమ వైవాహిక జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీకే, దిల్షాన్ తమ భార్యలు.. తమతో బంధంలో కొనసాగుతూనే.. తమ స్నేహితులతోనే అనుబంధం పెనవేసుకోవడం భరించలేకపోయారు. వారితో బంధానికి వీడ్కోలు పలికి కొత్త జీవితం మొదలుపెట్టి ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా గడుపుతున్నారు. వారి జీవితాల్లో ఏం జరిగిందంటే.. స్నేహం ముసుగులో వెన్నుపోటు చిన్ననాటి స్నేహితురాలైన నికిత వంజారాను ప్రేమించి పెళ్లాడాడు దినేశ్ కార్తిక్. డీకే సహచర క్రికెటర్, ఫ్రెండ్ అయిన మురళీ విజయ్‌తో బంధం కొనసాగించింది. వారిద్దరి రహస్య రిలేషన్షిప్ తెలుసుకున్న దినేశ్ గుండె ముక్కలైంది. దీంతో 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలో నికిత ఎంచక్కా మురళీ విజయ్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. మరోవైపు.. స్వ్యాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ రూపంలో రెండోసారి ప్రేమను పొందిన డీకే ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ప్రస్తుతం కవలలు(ఇద్దరు కుమారులు) సంతానం. దిల్షాన్ది ఇంచుమించు ఇదే పరిస్థితి లంక లెజండరీ ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ నిలంక వితంగే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె దిల్షాన్ ఓపెనింగ్ పార్ట్నర్ ఉపుల్ తరంగతో అనుబంధం పెంచుకుందట. ఈ క్రమంలో దిల్షాన్‌తో విడాకులు తీసుకున్న నిలంక.. ఆ తర్వాత ఉపుల్ను పెళ్లాడింది. నిజానికి నిలంక, ఉపుల్ మధ్య అతి చనువే దిల్షాన్‌తో ఆమె విడిపోవడానికి కారణమని గతంలో వార్తలు వచ్చాయి. భార్య మంజులతో దిల్షాన్ ఇక నిలంక- దిల్షాన్లకు ఒక కుమారుడు సంతానం కాగా.. భరణం, కుమారుడి సంరక్షణ కోసం నిలంక.. దిల్షాన్‌ను కోర్టుకు లాగింది. ఈ క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పురాగా అతడు కొడుకుకు దూరమయ్యాడు. ఆ తర్వాత నటి మంజుల థిలినిని పెళ్లాడిన దిల్షాన్‌కు మరో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. బ్రెట్ లీ మాజీ భార్య సైతం ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా భార్యా బాధితుడే అంటారు. ఆటతో బిజీగా ఉండే లీతో తన జీవితం సంతోషంగా లేదని భావించిన అతడి భార్య.. రగ్బీ ప్లేయర్‌ను పెళ్లాడినట్లు సిడ్నీ హెరాల్డ్ గతంలో వెల్లడించింది. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు! -
తరంగ విధ్వంసం.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా ఆసియా లయన్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 ఛాంపియన్స్‌గా ఆసియా లయన్స్ నిలిచింది. దోహా వేదికగా జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో ఆసియా లయన్స్ చిత్తు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్.. కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1ఓవర్లలోనే ఛేదించింది. ఆసియా బ్యాటర్లలో ఓపెనర్లు ఉపుల్ తరంగ(28 బంతుల్లో 57 పరుగులు), తిలకరత్నే దిల్షాన్(58) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. తరంగ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం మిస్బా-ఉల్-హక్(9), మహమ్మద్ హఫీజ్(9) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. వరల్డ్ జెయింట్స్ బ్యాటర్లలో జాక్వెస్ కల్లిస్(54 బంతుల్లో 78 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు రాస్ టేలర్(32) పరుగులతో రాణించాడు. ఆసియా బౌలర్లలో స్పిన్నర్ రజాక్ రెండు వికెట్లు సాధించగా.. పెరీరా ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: Indian Wells: ‘నంబర్‌వన్’ అల్కరాజ్.. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సొంతం -
వయసు పైబడినా వన్నె తగ్గలేదు..
రాయ్‌పూర్: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడిచినా.. దిగ్గజ ఆటగాళ్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా మొన్న బంగ్లా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. నిన్న విండీస్ ఆల్ టైమ్ గ్రేట్ బ్రియాన్ లారా (49 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్), శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఉపుల్ తరంగ(35 బంతుల్లో 8 ఫోర్లుతో 53 నాటౌట్)లు సత్తా చాటాడు. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్.. విండీస్ లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా(53 నాటౌట్), డ్వేన్ స్మిత్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్, చింతక జయసింఘే చెరో వికెట్ తీశారు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్.. ఉపుల్ తరంగా(53 నాటౌట్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తరంగాకు తోడుగా తిలకరత్నే దిల్షాన్(37 బంతుల్లో 8 ఫోర్లతో 47) రాణించాడు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్ అడిన తరంగాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆదివారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెజెండ్స్‌తో, బంగ్లా దిగ్గజాలు తలపడనున్నారు. -
ఆటకు గుడ్‌బై చెప్పిన లంక స్టార్ ఆటగాడు
కొలంబొ: శ్రీలంక సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ ఉపుల్ తరంగ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన 16 ఏళ్ల కెరీర్ నేటితో ముగిసిందంటూ ట్విటర్ ద్వారా ప్రకటించాడు.2005లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తరంగ 235 వన్డేల్లో 6951 పరుగులు, 31 టెస్టుల్లో 1754 పరుగులు, 26 టీ20ల్లో 407 పరుగులు చేశాడు. వన్డేల్లో 15 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు చేసిన తరంగ.. టెస్టుల్లో 3 సెంచరీలు, 8 అర్థ శతకాలు బాదాడు. 2007,2011 ప్రపంచకప్‌లలో తరంగ శ్రీలంక జట్టు సభ్యుడిగా ఉన్నాడు.2006లో ఇంగ్లండ్ టూర్లో వన్డే సిరీస్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేయడం వెనుక తరంగ కీలకపాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో సనత్ జయసూర్యతో కలిసి తరంగ వన్డే ఓపెనింగ్ రికార్డు భాగస్వామ్యం సాధించడంతో పాటు 102 బంతుల్లో 109 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. 2019లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా లంక తరపున తరంగ తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ సందర్భంగా తరంగ ట్విటర్ ద్వారా తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు. ' ఈరోజుతో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నా. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. 16 ఏళ్ల పాటు లంక్ క్రికెట్‌కు సేవలందించడం గొప్ప అనుభూతి. ఈ 16 ఏళ్లలో జట్టుతో ఎన్నో జ్ఞాపకాలతో పాటు మంచి స్నేహితులు ఎందరో దొరికారు. విఫలమైన ప్రతీసారి నాపై ఉన్న నమ్మకంతో అవకాశాలు ఇచ్చిన లంక్ క్రికెట్ బోర్డుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇన్నేళ్ల పాటు నాకు మద్దతునిచ్చిన అభిమానులకు.. కష్టకాలంలో నాకు తోడుగా ఉన్న కుటుంబసభ్యులకు ఎంతో రుణపడి ఉన్నా.మీరిచ్చిన ఆశీర్వాదంతోనే ఇంతకాలం క్రికెట్‌ను ఆడగలిగా.. థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్' అంటూ ఉద్వేగంతో తెలిపాడు. చదవండి: వివాదాస్పద ‘అంపైర్స్ కాల్’ రద్దు చేస్తున్నారా? అప్పుడు ఇషాంత్ నిద్రపోతున్నాడు: కోహ్లి -
'ఈ సిరీస్ మాకు చాలా ముఖ్యం'
ఢాకా: ఇటీలవ పేలవమైన ఫామ్‌తో సతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టు.. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. తొలి టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకున్న లంకేయులు.. రెండో టెస్టులో 215 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే రెండు ట్వంటీ 20ల సిరీస్‌కు శ్రీలంక సిద్ధమవుతోంది. ఈరోజు(గురువారం) ఢాకాలో ఇరు జట్ల మధ్య తొలి టీ 20 జరుగనుంది. దానిలో భాగంగా లంక ఆటగాడు ఉపుల్ తరంగా మాట్లాడుతూ.. టెస్టు సిరీస్‌లో ప్రదర్శననే టీ 20 సిరీస్‌లో కూడా పునరావృతం చేస్తామంటున్నాడు. ' టెస్టు సిరీస్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే టీ 20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాం. ఈ సిరీస్ మాకు చాలా ముఖ్యం. దాదాపు ఏడాదిన్నర కాలంగా మా జట్టులో నిలకడ లోపించింది. మేము నిలకడను అందిపుచ్చుకోవాలంటే బంగ్లాతో టీ 20 సిరీస్ సాధించడం ఎంతో అవసరం. సిరీస్‌ను గెలుస్తామని ఆశిస్తున్నా' అని తరంగా పేర్కొన్నాడు. ఢాకాలో వికెట్ ఎలా ఉండబోతుందనేది కచ్చితంగా చెప్పలేమని తెలిపిన తరంగా..మంచి వికెటే ఎదురవుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు. -
ధోని మార్క్ కీపింగ్.. తరంగ సెంచరీ మిస్
సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని మరోసారి తన మార్క్ కీపింగ్‌ను ప్రదర్శించాడు. దీంతో శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ 95( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ చేజార్చుకున్నాడు. భారత చైనామన్ కుల్దీప్ యాదవ్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని ఉపుల్ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్ ఆన్ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. దీంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. నిజానికి ఇది అందరూ నాటౌట్ అనుకున్నా థర్డ్ అంపైర్ వికెట్‌గా ప్రకటించడంతో మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు. ధోని వ్యూహంతో డిక్వెల్లా అవుట్.. ఇక ఇదే ఓవర్ ఐదో బంతికి ధోని వ్యూహంతో కుల్దీప్ డిక్వెల్లాను అవుట్ చేశాడు. బంతి వేసే ముందు కుల్దీప్ దగ్గరకు వచ్చిన ధోని స్లిప్‌లో అయ్యర్‌ను ఫీల్డింగ్ పెట్టుకోమని సూచించాడు. ఈ బంతి డిక్వెల్లా బ్యాట్‌ను తగిలి నేరుగా అయ్యర్ చేతిలో పడింది. ఈ వికెట్‌తో ధోని వ్యూహం ఫలించింది. దీంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయింది. ధోని ఇప్పటికే వన్డేల్లో అత్యధిక స్టంప్అవుట్లు సాధించిన కీపర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
ధోని మార్క్ కీపింగ్.. తరంగ సెంచరీ మిస్
-
పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ల వర్షం.!
సాక్షి, విశాఖ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో లంక ఓపెనర్ ఉపుల్ తరంగ అర్థ సెంచరీ సాధించాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వేసిన 8 ఓవర్లో వరుసగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో శ్రీలంక 9 ఓవర్లలోపే 65 పరుగులు చేసింది. ఈ ఓవర్‌కు ముందు లంక స్కోర్ 45/1 ఉండగా.. అనంతరం తరంగ 20 పరుగుల పిండుకోవడంతో 65 పరుగులకు చేరింది. ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు లంక స్కోర్ 73/1. క్రీజులో తరంగ(50)తొ పాటు సమరవిక్రమా(10)లున్నారు. -
పాండ్యా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు
-
బూమ్రా నో బాల్ వల్లే..
ధర్మశాల: భారత్‌తో ఇక్కడ జరిగిన తొలి వన్డేలో పేసర్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా వేసిన నోబాలే మ్యాచ్ ఫలితాన్ని మార్చివేసిందని లంక కోచ్ నికో పోథస్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 112 పరుగులకు ఆల్ట్ కాగా, అనంతరం ఛేదన ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన శ్రీలంక 7/1తో ఉన్న దశలోనే ఉపుల్ తరంగా వికెట్‌ని బుమ్రా తీసినా.. అది రిప్లేలో నోబాల్‌గా తేలింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న తరంగా (49: 46 బంతుల్లో 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో లంకేయులు 20.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన సమయంలో ఈ తరహా పొరపాట్లు మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయని పోథస్ పేర్కొన్నాడు. ‘ధర్మశాల వన్డేలో రెండు అంశాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ఒకటి శ్రీలంక టాస్ గెలవడం.. రెండు నోబాల్ కారణంగా ఉపుల్ తరంగాకి లైఫ్ లభించడం. తొలి వికెట్ కోల్పోయిన కొద్ది నిమిషాల్లోనే మరో వికెట్ పడుంటే కచ్చితంగా లంక ఒత్తిడిలో పడేది. ఎందుకంటే.. తర్వాత వికెట్ (తిరుమానె) 19 పరుగుల వద్దే పడింది. ఉపుల్ తరంగ బంతి నోబాల్‌గా కాకుండా ఉండి ఉంటే.. 19/3 నుంచి జట్టు కోలుకోవడం కష్టమయ్యేది’ అని కోచ్ పోథస్ అభిప్రాయపడ్డాడు. బుధవారం ఇరు జట్ల మధ్య మొహాలిలో రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు ఉంటాయి. కానిపక్షంలో ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే టీమిండియా సిరీస్‌ను సమర్పించుకోవాల్సి వస్తుంది. -
హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో..
ధర్మశాల:టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక 65 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంకేయులు ఆదిలో తడబడ్డారు. 19 పరుగులే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఉపుల్ తరంగా(49) ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. కాగా, హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు గుణతిలకా(1), తిరుమన్నే(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. లంకేయులు కోల్పోయిన మూడు వికెట్లలో బూమ్రా, భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 112 పరుగులకు చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. ధోని(65) మినహా ఎవరూ రాణించలేదు. -
'నేను కెప్టెన్సీ నుంచి తప్పుకోను'
కొలంబో: టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో శ్రీలంక వైట్ వాష్ కావడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా శ్రీలంక వన్డే కెప్టెన్సీ పదవి నుంచి ఉపుల్ తరంగా తప్పుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన తరంగా.. తన కెప్టెన్సీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసలు సారథి బాధ్యతల నుంచి తప్పుకునే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 'నేను కెప్టెన్సీ వదులు కోవడానికి సరైన కారణం లేదు. టీమిండియాతో ఓటమికి నేనొక్కడినే బాధ్యుణ్ని కాను. మొత్తం జట్టంతా చెత్త ప్రదర్శన చేసింది కాబట్టే ఓడాం. ప్రధానంగా మా బ్యాట్స్‌మెన్ సరిగా రాణించలేకపోవడం వల్లే ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాం. ఇక్కడ నా బాధ్యత కొంత వరకూ ఉన్నా.. పూర్తిగా నన్ను బలిపశువును చేయడం తగదు'అని తరంగా తెలిపారు. ఒకవేళ తమ జట్టు ఎలా ముందుకెళ్లాలి అనేది ఏమైనా ఉంటే అది సెలక్షన్ కమిటీ చూసుకుంటుందన్నారు. తామంతా నిలకడలేమి సతమతమైన కారణంగా 5-0 తో సిరీస్ ను కోల్పోవడానికి ప్రధాన కారణంగా తరంగా పేర్కొన్నారు. -
శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ
పల్లెకెలె: ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగా మిగతా రెండు వన్డేలకు దూరం కానున్నాడు. భారత్ తో గురువారం జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా తరంగాపై రెండు మ్యాచ్ ల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. దాంతో మిగతా వన్డేల కోసం టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్, టాపార్డర్ ఆటగాడు తిరిమన్నెలకు పిలుపు అందింది. చండీమాల్ ను వన్డేల్లో ఆడించకపోవడంపై లంక క్రికెట్ బోర్డుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ తరుణంలో తరంగా దూరం కావడంతో చండిమాల్ కు మార్గం సుగమైంది. పల్లెకెలె మ్యాచ్ లో భారత్ మూడు వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. ఎంఎస్ ధోని- భువనేశ్వర్ లు వంద పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. జట్టు ఓటమి అంచున నిలిచిన సమయంలో వీరిద్దరూ సుదీర్ఘంగా క్రీజ్ లో నిలబడి గెలుపును ఖాయం చేశారు. -
శ్రీలంక క్రికెట్ కు ఇద్దరు కెప్టెన్లు!
కొలంబో:ఇటీవల శ్రీలంక క్రికెట్ కెప్టెన్సీ పదవి నుంచి ఏంజెలో మాథ్యూస్ తప్పుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జింబాబ్వే తో జరిగిన వన్డే సిరీస్ ను కోల్పోయిన తరువాత అందుకు నైతిక బాధ్యత వహిస్తూ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో శ్రీలంక క్రికెట్ లో ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తులు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఎట్టకేలకు ఇద్దర్ని కెప్టెన్లను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక టెస్టు కెప్టెన్ గా దినేష్ చండిమాల్ ను , వన్డే, ట్వంటీ 20(పరిమిత ఓవర్ల) కెప్టెన్ గా ఉపుల్ తరంగాను ఎంపిక చేసింది. ఈ మేరకు మాట్లాడిన చండిమాల్.. కెప్టెన్ గా మాథ్యూస్ తప్పుకోవడం తమ జట్టుకు లోటేనన్నాడు. శ్రీలంక జట్టును ముందుకు తీసుకెళ్లడంలో మాథ్యూస్ తన శక్తిమేర కృషి చేసినందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక నుంచి మాథ్యూస్ జట్టులో సభ్యుడిగా ఉంటూ సేవలందిస్తాడని పేర్కొన్న చండిమాల్.. కెప్టెన్సీ అనేది ఈజీ జాబ్ కాదనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనన్నాడు. 2011టెస్టుల్లో అరంగేట్రం చేసిన చండిమాల్.. ఇప్పటివరకూ 36 టెస్టుల్లో 42.33 సగటుతో 2,540 పరుగులు చేశాడు. -
శ్రీలంక కెప్టెన్లు వీరే..
కొలంబో: లిమిటెడ్ ఫార్మట్‌కు ఉపుల్ తరంగ, టెస్టులకు దినేష్ చండిమల్లను కెప్టెన్లుగా ఎంపికచేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. బలహీనమైన జింబాంబ్వేతో స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నవిషయం తెలిసిందే. దీంతో శ్రీలంక బోర్డు అత్యవసరంగా సమావేశమై బుధవారం నూతన కెప్టెన్లను ప్రకటించింది. వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న చండీమల్‌ను టెస్టులకు , మాథ్యూస్ గైర్హాజరీతో కెప్టెన్సీ చేసిన ఉపుల్ తరంగను వన్డే, టీ20లకు కెప్టెన్లుగా నియమించింది. దీంతో పాటు జింబాంబ్వేతో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు జట్టును ప్రకటిస్తూ బోర్డు అధికారిక ట్వీటర్లో పోస్టు చేసింది. ఇక ఈ టెస్టుకు చండీమల్ కెప్టెన్‌గా తరంగ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వీరి సారథ్యంలోనే శ్రీలంక స్వదేశంలో భారత్‌తో 3 టెస్టులు, 5 వన్డేలు, 1టీ20 ఆడనుంది. ఉపుల్ తరంగ శ్రీలంక తరుపున 207 వన్డేలు ఆడి 14 సెంచరీలు, 34 అర్ధసెంచరీలతో 6,212 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో 27 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో 1,568 పరుగులు చేశాడు. ఇక టెస్టు కెప్టెన్ దినేష్ చండీమల్ 36 టెస్టులు ఆడి 8 సెంచరీలు 11 హాఫ్ సెంచరీలతో 2,540 పరుగులు చేశాడు. జింబాబ్వే చేతిలో ఓడటాన్ని తన కెరీర్లోనే అత్యంత ఘోర పరాభవంగా చెప్పుకొచ్చిన మాథ్యూస్ 34 టెస్టులు, 98 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని సారథ్యంలోనే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఈ సీజన్లో అతను గాయంతో కీలకమైన సిరీస్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టి20లకు, స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లకు అతను గైర్హాజరయ్యాడు. జయవర్ధనే వారసుడిగా 2013లో జట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా లంక తరఫున యువ కెప్టెన్‌గా మాథ్యూస్ ఘనతకెక్కాడు. Fresh outlook, fresh plans .. pic.twitter.com/YTlHsIj8mT — Sri Lanka Cricket (@OfficialSLC) 12 July 2017 -
'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'
దుబాయ్: వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన శ్రీలంక క్రికెట్ జట్టులో ఓపెనర్ ఉపుల్ తరంగకు చోటు కల్పించకపోవడంపై స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఉపుల్ తరంగకు ఉద్వాసన పలికి యువ ఆల్ రౌండర్ జీవన్ మెండిస్ కు చోటు కల్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని మురళీధరన్ పేర్కొన్నాడు. తరంగకు వన్డేల్లో మంచి రికార్డు ఉందని, అతడి అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుందన్నాడు. అయితే తరంగను కాదని జీవన్ ను ఎంపిక చేయడం సబబుగా లేదని అభిప్రాయపడ్డాడు. ఐదు ప్రపంచకప్ లు ఆడిన మురళీధరన్ 67 వికెట్లు తీశాడు.