
శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ
పల్లెకెలె: ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగా మిగతా రెండు వన్డేలకు దూరం కానున్నాడు. భారత్ తో గురువారం జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా తరంగాపై రెండు మ్యాచ్ ల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. దాంతో మిగతా వన్డేల కోసం టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్, టాపార్డర్ ఆటగాడు తిరిమన్నెలకు పిలుపు అందింది. చండీమాల్ ను వన్డేల్లో ఆడించకపోవడంపై లంక క్రికెట్ బోర్డుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ తరుణంలో తరంగా దూరం కావడంతో చండిమాల్ కు మార్గం సుగమైంది.
పల్లెకెలె మ్యాచ్ లో భారత్ మూడు వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. ఎంఎస్ ధోని- భువనేశ్వర్ లు వంద పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. జట్టు ఓటమి అంచున నిలిచిన సమయంలో వీరిద్దరూ సుదీర్ఘంగా క్రీజ్ లో నిలబడి గెలుపును ఖాయం చేశారు.