
ధర్మశాల: భారత్‌తో ఇక్కడ జరిగిన తొలి వన్డేలో పేసర్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా వేసిన నోబాలే మ్యాచ్ ఫలితాన్ని మార్చివేసిందని లంక కోచ్ నికో పోథస్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 112 పరుగులకు ఆల్‌ట్ కాగా, అనంతరం ఛేదన ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన శ్రీలంక 7/1తో ఉన్న దశలోనే ఉపుల్ తరంగా వికెట్‌ని బుమ్రా తీసినా.. అది రిప్లేలో నోబాల్‌గా తేలింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న తరంగా (49: 46 బంతుల్లో 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో లంకేయులు 20.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన సమయంలో ఈ తరహా పొరపాట్లు మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయని పోథస్ పేర్కొన్నాడు.
‘ధర్మశాల వన్డేలో రెండు అంశాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ఒకటి శ్రీలంక టాస్ గెలవడం.. రెండు నోబాల్ కారణంగా ఉపుల్ తరంగాకి లైఫ్ లభించడం. తొలి వికెట్ కోల్పోయిన కొద్ది నిమిషాల్లోనే మరో వికెట్ పడుంటే కచ్చితంగా లంక ఒత్తిడిలో పడేది. ఎందుకంటే.. తర్వాత వికెట్ (తిరుమానె) 19 పరుగుల వద్దే పడింది. ఉపుల్ తరంగ బంతి నోబాల్‌గా కాకుండా ఉండి ఉంటే.. 19/3 నుంచి జట్టు కోలుకోవడం కష్టమయ్యేది’ అని కోచ్ పోథస్ అభిప్రాయపడ్డాడు. బుధవారం ఇరు జట్ల మధ్య మొహాలిలో రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు ఉంటాయి. కానిపక్షంలో ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే టీమిండియా సిరీస్‌ను సమర్పించుకోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment