
ధర్మశాల: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌తో భారత యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌కు ముందు సీనియర్ ఆటగాడైన మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. కెప్టెన్ కోహ్లి విశ్రాంతి తీసుకోవడంతో ఈ సిరీస్‌కు రోహిత్ కెప్టెన్సీ వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీనియర్ ఆటగాడైన అజింక్యా రహానేకు జట్టులో చోటు దక్కలేదు. పేసర్లకు అనుకూలించే పిచ్ అని, కెప్టెన్‌గా ఓ గొప్ప బాధ్యత తనపై ఉందని, మంచి జట్టుతో బరిలోకి దిగుతున్నామని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇక బ్యాటింగ్ పిచ్ కావడంతో చేజింగ్ సులువని ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ పెరీరా పెర్కొన్నాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, చహల్
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), తరంగ, గుణతిలక, తిరిమన్నె, డిక్‌వెలా, మాథ్యూస్, గుణరత్నే, సచిత్, లక్మల్, ప్రదీప్, అకిల ధనంజయ
Comments
Please login to add a commentAdd a comment