
మెల్‌బోర్న్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతన్న నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో టాస్ కాస్త ఆలస్యం అయింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఆరంగేట్రం చేస్తున్నాడు. మహ్మద్ సిరాజ్‌ను తప్పించి అతడికి చోటు కల్పించారు. రాయుడు స్థానంలో కేదార్ జాదవ్, కుల్దీప్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చారు.
ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. టి20 సిరీస్‌ను 1-1తో ముగించి, టెస్ట్ సరీస్‌లో 2-1తో విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో నెగ్గి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. (మెల్‌బోర్న్‌లోనూ మెరిస్తే...)
తుది జట్లు:
భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, జడేజా, చహల్, భువనేశ్వర్, షమీ.
ఆస్ట్రేలియా: క్యారీ, ఫించ్ (కెప్టెన్), ఖాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, జంపా, స్టాన్‌లేక్, సిడిల్, రిచర్డ్‌సన్
Comments
Please login to add a commentAdd a comment