కటక్: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది.
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాట్స్‌మెన్‌లో ఉపుల్ తరంగ 23( 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు), కుశాల్ పెరీరా(19), డిక్వెల్లా(13), చమీరా(12)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడంతో శ్రీలంక 87 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లలో చాహల్ (4), పాండ్యా(3), కుల్దీప్ యాదవ్(2) వికెట్లు తీయగా.. ఉనద్కత్ ఒక వికెట్ తీశాడు.
రాహుల్ హాఫ్ సెంచరీ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్ రోహిత్(17) నిరాశపర్చగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 61 (48 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సు) అర్ధ సెంచరీతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మరో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 24(20 బంతులు, 3 ఫోర్లు).. చివర్లో ధోని 39(22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు), మనీష్ పాండే 32(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment