సాక్షి, హైదరాబాద్: భారత యువ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్లు చేజిక్కించుకొని ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు. 11 మ్యాచ్‌లు ఆడిన చహల్ 23 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా 17వికెట్లతో అప్ఘనిస్థాన్ యువ బౌలర్ రషీద్ ఖాన్, కె విలియమ్స్(వెస్టిండీస్)లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. డెత్ బౌలర్ల స్పెషలిస్టు, భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 11 వికెట్లతో 9వ స్థానంలో నిలవగా. .చైనామన్ కుల్దీప్ యాదవ్ 7 మ్యాచుల్లో 7 వికెట్లతో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.
సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ప్రత్యామ్నాయంగా పొట్టి ఫార్మట్‌లో ఈ యువ స్పిన్ బౌలర్లను బీసీసీఐ పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో రెండో టీ20లో తొలుత దారుణంగా పరుగుల సమర్పించిన చహల్(4-52), కుల్దీప్(3-52)లు చివర్లో 7 వికెట్లు పడగొట్టి భారత్‌కు భారీ విజయాన్నందించారు.
Comments
Please login to add a commentAdd a comment