కటక్: లంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపుపొందాడు. ఈ మ్యాచ్‌కు ముందు 15 పరుగుల దూరంలో ఉన్న రోహిత్ ధనుంజయ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే మరో రెండు పరుగులు చేసిన రోహిత్(17) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు.
ఇప్పటివరకు 69 మ్యాచ్‌లు ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్ 130.04 స్ట్రైక్ రేటుతో ఒక సెంచరీ, 12 అర్ధశతకాలతో 1502 పరుగులు చేశాడు. అంతకు ముందు ఈ ఘనతను భారత కెప్టెన్ కోహ్లి సాధించగా.. తాజా మ్యాచ్‌తో రోహిత్ ఈ జాబితాలో చేరాడు. 55 టీ20లు ఆడిన కోహ్లి 137.84 స్ట్రైక్ రేటుతో 1956 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో రోహిత్ 14వ స్థానంలో ఉండగా కోహ్లి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మెకల్లమ్ (2140) ఉన్నాడు.
రోహిత్ మరో ఘనత.!
Published Wed, Dec 20 2017 7:43 PM | Last Updated on Wed, Dec 20 2017 7:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment