కటక్: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధశతకంతో మెరిశాడు. దీనికి తోడు యువ ఆటగాడు మనీష్ పాండే 32(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు), ధోని 39(22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు) తోడవ్వడంతో భారత్ 181 పరుగుల లక్ష్యాన్ని లంకకు నిర్ధేశించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మాథ్యూస్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటై ఓపెనర్ రోహిత్(17) తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చాలా రోజుల తర్వాత అవకాశం దక్కించుకున్న రాహుల్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
జట్టు స్కోర్ 101 పరుగుల వద్ద ప్రదీప్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(24) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరికాసేపటికే రాహుల్ 61 (48 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సు) సైతం అవుటవ్వడంతో భారత్ స్కోర్ వేగం నెమ్మదించింది. ఈ పరిస్థితిల్లో ధోని, యువ ఆటగాడు మనీష్ పాండేలు వేగంగా ఆడే ప్రయత్నం చేశారు..కానీ లంక అద్బుత ఫీల్డింగ్‌తో పదే పదే బౌండరీలు ఆపడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. చివర్లో ప్రదీప్ వేసిన 19 ఓవర్ భారత్‌కు కలిసొచ్చింది. రెండు వైడ్‌లు ఒక నోబాల్ వేసి ప్రదీప్ మొత్తం 21 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో భారత్ 180 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో తిసారా పెరీరా, మాథ్యూస్, నువాన్ ప్రదీప్‌లకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment