Courtesy: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టి20ల్లో టీమిండియా తరపున కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2022లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో రాహుల్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా టి20 క్రికెట్‌లో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అయితే 6వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.
రాహుల్ ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 179 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లిని(184 ఇన్నింగ్స్‌లు) అధిగమించాడు. రాహుల్, కోహ్లి తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్(213 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉండగా.. సురేశ్ రైనా(217 ఇన్నింగ్స్‌లు) నాలుగు, రోహిత్ శర్మ(218 ఇన్నింగ్స్‌లు) ఐదో స్థానంలో ఉన్నాడు,
ఇక ఓవరాల్‌గా టి20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆల్‌టైమ్ జాబితాలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. రాహుల్ కంటే ముందు క్రిస్ గేల్(162 ఇన్నింగ్స్‌లు), పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(165 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి(3,296 పరుగులు), రోహిత్ శర్మ(3,313 పరుగులు) తర్వాతి స్థానంలో రాహుల్(1831 పరుగులతో) మూడో స్థానంలో నిలిచాడు.
చదవండి: IPL 2022-KL Rahul: ఐపీఎల్ నిబంధన ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా
LSG vs RCB: అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో మ్యాచ్ గెలిచేదేమో!
Comments
Please login to add a commentAdd a comment