ICC T20I Match Player Rankings, Virat Kohli Reclaims No.5 Spot In ICC T20I Player Rankings - Sakshi
Sakshi News home page

టాప్‌ 5లోకి కోహ్లి..దిగజారిన కేఎల్‌ రాహుల్‌ ర్యాంకింగ్‌

Mar 17 2021 5:39 PM | Updated on Mar 17 2021 9:40 PM

 Latest ICC T20 Rankings - Sakshi

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారధి విరాట్‌ కోహ్లి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు, మూడు టీ20ల్లో అజేయ అర్ధశతకాలతో(73, 77) అలరించిన ఆయన.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరు నుంచి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు వరుస డకౌట్లతో నిరాశపరుస్తున్న టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానాన్ని కోల్పోయి మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారాడు. టాప్‌-10లో ఈ ఇ‍ద్దరు టీమిండియా బ్యాట్స్‌మెన్లు మినహా ఎవరికి చోటు దక్కలేదు. కాగా, ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, రెండవ స్థానంలో ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌, మూడో స్థానంలో పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ ఉన్నారు. 

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏ ఒక్క బౌలర్‌కు కూడా చోటు దక్కలేదు. ఈ జాబితాలో ఆఫ్గనిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రేజ్‌ షంషీ రెండులో, మరో ఆఫ్గనిస్తాన్‌ స్పిన్నర్‌ ముజీబుర్‌ రెహమాన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో సైతం టీమిండియా ఆటగాళ్ల ప్రాతినిధ్యం లేకపోగా, ఈ జాబితాలో ఆఫ్గనిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ నబీ అగ్రస్థానంలో, బంగ్లాదేశ్‌ షకీబుల్‌ హసన్‌ రెండులో, ఆసీస్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ మూడో స్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement