సన్‌రైజర్స్ హ్యాట్రిక్ కొట్టనుందా?
ముంబై: ఐపీఎల్-10లో విజయాలతో దూసుకుపోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. బుధవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో పోరుకు సిద్దమైంది. ఇరు జట్ల పటిష్టంగా ఉండటంతో హోరాహోరి పోరు జరుగనుంది. ఆదివారం కొల్‌కతా నైట్‌రైడర్స్‌తో నువ్వానేనా అన్న రీతిలో సాగిన మ్యాచ్‌లో ముంబై త్రిల్లింగ్ విజయంతో భోణి కొట్టింది. దాదాపు ఓటమి అంచుల నుంచి జట్టు విజయానందించిన యువ హిట్టర్లతో డెత్ ఓవర్లలో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న ముంబై ఆటగాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ప్రతికారం తీర్చుకోవాలనుకుంటున్నారు. గత సీజన్‌లో ఈ జట్లు రెండు సార్లు తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నే విజయం వరించింది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్‌కు హోం గ్రౌండ్ కావడంతో ఆజట్టు గెలుపుపై ధీమాగా ఉంది. ఇప్పటికే హోంగ్రౌండ్‌లో కొల్‌కతాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాళ్లు నితీష్‌రాణా, హార్దిక్ పాండ్యాల మెరుపు బ్యాటింగ్‌తో ముంబై పదో సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఐపీఎల్ మొత్తంలో ముంబై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 5 సార్లు తలపడగా 3 సార్లు నెగ్గి 2 సార్లు ఓడింది. ముంబై ఇండియన్స్ యవ ఆటగాళ్లు హార్దిక్‌పాండ్యా, నితీశ్‌రాణా, క్రుణాల్‌పాండ్యా, శ్రీలంకన్ యార్కర్స్ స్పెషలిస్టు లసిత్ మలింగాలతో జట్టు బలంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ హర్భజన్ సింగ్, పోలార్డ్ తమ స్థాయి తగ్గ ఆట ప్రదర్శిస్తే ముంబైకి తిరుగులేదు. ఆతిథ్య జట్టు సన్‌రైజర్స్‌లో యువ సంచలనం అప్ఘన్ బౌలర్ రషీద్‌ఖాన్, కెప్టెన్ వార్నర్ . యువరాజ్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అశిశ్‌నేహ్రా ఆల్‌రౌండర్ హెన్రీక్స్‌లతో జట్టు బలంగా ఉంది. మంచి ఫాంలో ఉన్న సన్‌రైజర్స్ ఆటగాళ్లు మరోసారి విజృంభిస్తే హైదరాబాద్‌కు తిరుగులేదు.