రోహిత్‌ తన రాజ్యంలో చెలరేగిపోతున్నాడు.. సెంచరీ పూర్తి చేశాడు..! | IPL 2024 MI VS RCB: Rohit Sharma Completed 100 Sixes At Wankhede In T20s | Sakshi
Sakshi News home page

IPL 2024 MI VS RCB: రోహిత్‌ తన రాజ్యంలో చెలరేగిపోతున్నాడు.. సెంచరీ పూర్తి చేశాడు..!

Published Fri, Apr 12 2024 12:09 PM | Last Updated on Fri, Apr 12 2024 12:09 PM

IPL 2024 MI VS RCB: Rohit Sharma Completed 100 Sixes At Wankhede In T20s - Sakshi

ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో చెలరేగిపోతున్నాడు. ఈ మైదానంలో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడే రోహిత్‌ ఆర్సీబీతో నిన్నటి మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో బాదిన సిక్సర్లతో హిట్‌మ్యాన్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వాంఖడే లో వంద సిక్సర్లు (టీ20ల్లో) సిక్సర్ల సెంచరీ కొట్టిన తొలి ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు గురించి తెలిసి అభిమానులు హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రోహిత్‌ తన రాజ్యంలో చెలరేగిపోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, రోహిత్‌తో పాటు బ్యాటర్లంతా చెలరేగడంతో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ​్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్‌ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్‌ పాటిదార్‌ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌ (53 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు.

అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను ఓడేలా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement