పుణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్రీజులో గ్లెన్ ఫిలిప్స్(9), టామ్ బ్లండెల్(30) ఆజేయంగా ఉన్నారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ 301 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ టామ్ లాథమ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 133 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసి లాథమ్ ఔటయ్యాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ సాధించాడు.
తేలిపోయిన భారత బ్యాటర్లు..
అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్ స్పిన్ వలలో భారత్ చిక్కుకుంది. మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు యశస్వీ జైశ్వాల్(30), శుబ్‌మన్ గిల్(30) పర్వాలేదన్పించారు.
చదవండి: IND vs NZ: బెడిసికొట్టిన గంభీర్ వ్యూహం..! టీమిండియా ఫ్యాన్స్ ఫైర్?
Comments
Please login to add a commentAdd a comment