పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, డార్లీ మిచెల్‌ను అద్బుతమైన బంతులతో సుందర్ బోల్తా కొట్టించాడు.
ముఖ్యంగా రవీంద్ర, బ్లండెల్‌ను వాషీ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ స్ధానంలో జట్టులోకి వచ్చిన సుందర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు.
తొలి స్పెల్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసిన సుందర్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ 59 ఓవర్ల తర్వాత ఎటాక్‌లో తీసుకువచ్చాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రచిన్ రవీంద్రను పెవిలియన్‌కు పంపేందుకు హిట్‌మ్యాన్ సుందర్‌కు బంతి ఇచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని సుందర్ వమ్ము చేయలేదు.
రచిన్ షాక్..
కివీస్ ఇన్నింగ్స్ 60వ ఓవర్ వేసిన వాషింగ్టన్ తొలి బంతిని రచిన్‌కు రౌండ్ ది వికెట్ నుంచి మిడిల్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే ఆ డెలివరీని రచిన్ ఫ్రంట్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ మిడిల్ స్టంప్ దిశగా పడిన బంతి ఎవరూ ఊహించని విధంగా టర్న్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.
ఇది చూసిన రచిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. చేసేదేమి లేక 65 పరుగులతో రచిన్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు బ్లండెల్‌ను కూడా సుందర్ ఈ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.
62 ఓవర్‌లో ఆఖరి బంతిని సుందర్ బ్లండెల్‌కు ఔట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. కానీ బంతి మాత్రం ఒక్క సారిగా లోపలకు టర్న్ అవుతూ స్టంప్స్‌ను తాకింది. దెబ్బకు 3 పరుగులు చేసిన బ్లండెల్ బిత్తర పోయాడు.
76 ఓవర్ల ముగిసే సరికి న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో సుందర్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ఇప్పటివరకు 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో సుందర్‌కు ఇదే తొలి ఫైవ్ వికెట్ల హాల్ కావడం విశేషం.
T. I. M. B. E. R! 🎯
Cracker of a ball! 👌 👌
Washington Sundar with a breakthrough 🙌 🙌
Live ▶️ https://t.co/YVjSnKCtlI #TeamIndia | #INDvNZ | @Sundarwashi5 | @IDFCFIRSTBank pic.twitter.com/OC8VS7fnwT— BCCI (@BCCI) October 24, 2024
చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment