ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్-2022లో లంకషైర్ తరపున ఆడుతోన్న భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తొలి రోజు నాలగు వికెట్లు సుందర్ పడగొట్టి తన జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. నార్తాంప్టన్‌షైర్ ఓపెనర్ విల్ యంగ్‌ను ఔట్ చేయడంతో సుందర్ తొలి కౌంటీ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా ఐపీఎల్-2022లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆడిన సుందర్ లీగ్ మధ్యలో గాయపడ్డాడు. అయితే టీ20 స్పెషలిస్టుగా పేరుందిన సుందర్‌కు గాయం నుంచి కోలుకున్న తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించి తిరిగి భారత జట్టులోకి రావాలని సుందర్ భావిస్తున్నాడు. మరోవైపు భారత వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో అదరగొట్టి తిరిగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
That is ridiculous, @luke_wells07! 🤯
— Lancashire Cricket (@lancscricket) July 19, 2022
A third for @Sundarwashi5 👏
🌹 #RedRoseTogether https://t.co/b8kJigt3ZI pic.twitter.com/vGVxeh86pe
చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Comments
Please login to add a commentAdd a comment