వాషింగ్టన్ సుందర్, షోయబ్, శశికాంత్(PC: Twitter)
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: అద్భుత పోరాట పటిమ కనబరిచిన ఆంధ్ర జట్టు ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. తమిళనాడుతో శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల ఆధిక్యంతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఆంధ్ర నిర్దేశించిన 203 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
పేస్ బౌలర్ కేవీ శశికాంత్ (4/47), ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (6/69) ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ (65; 5 ఫోర్లు) చివరిదాకా క్రీజులో ఉండటంతో తమిళనాడు విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే సుందర్‌ను శశికాంత్ అవుట్ చేసి ఆంధ్రకు చిరస్మరణీయ విజయం అందించాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 162/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర మరో 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 250 పరుగులవద్ద ఆలౌటైంది. రికీ భుయ్ (76; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా... చివర్లో శశికాంత్ (19; 1 సిక్స్), లలిత్ మోహన్ (16; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆంధ్ర ప్రత్యర్థిముందు ఊరించే లక్ష్యాన్ని పెట్టింది.
చదవండి: IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్... ఐపీఎల్ వేలం విశేషాలు
ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా..
IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్?
Comments
Please login to add a commentAdd a comment