వాషింగ్టన్ సుందర్(PC: Lancashire Cricket)
Washington Sundar suffers shoulder injury : చాలా కాలం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ఇటీవలే జింబాబ్వే టూర్‌కు ఎంపికైన అతడు.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో సుందర్ చివరి సారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు.
ఆ తర్వాత గాయం కారణంగా జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ యువ ఆల్‌రౌండర్‌ను గాయాల బెడద వేధించింది. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన అతడు.. లంకాషైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు.
బ్యాడ్ లక్..
అదే జోష్‌లో రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ తమిళనాడు స్పిన్ బౌలర్.. వోర్సెస్టర్‌షైర్‌తో బుధవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వాషింగ్టన్ సుందర్ మైదానాన్ని వీడాడు. ఈ విషయాన్ని లంకాషైర్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో సుందర్ ఫ్యాన్స్.. ‘‘మరీ ఇంత బ్యాడ్ లక్ ఏంటి భయ్యా.. రాకరాక వచ్చిన అవకాశం.. ఇదీ చేజారితే ఎలా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఆగష్టు 18 నుంచి టీమిండియా- జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శిఖర్ ధావన్ సారథ్యంలోని జట్టుకు వాషింగ్టన్ ఎంపికయ్యాడు. కానీ.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక తరచుగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల సుందర్.. వేలికి గాయం కావడంతో గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీ మిస్సయ్యాడు. ఇక ఆసియా కప్-2022 ఈవెంట్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.
చదవండి: Asia Cup Squad: సుందర్‌ను మరిచారా.. కావాలనే పక్కనబెట్టారా!
Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి..
Comments
Please login to add a commentAdd a comment