
టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు జాక్‌పాట్ తగిలింది. మెగావేలానికి ముందు మంచి ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్ కూడా ఒకడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న సుందర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రికార్డు స్థాయి ధరకు సొంతం చేసుకుంది. కనీస ధర రూ. 1.50 కోట్లతో సుందర్ వేలానికి రాగా.. రూ. 8.75 కోట్లకు అమ్ముడయ్యాడు. కాగా గత సీజన్‌లో సుందర్ ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
ఆర్‌సీబీ తరపున రూ. 3.25 కోట్లతో ఉన్న సుందర్‌కు ఈసారి రూ. 5 కోట్లు ఎక్కువగా రావడం జాక్‌పాట్ అనే చెప్పొచ్చు. ఇప్పటివరకు సుందర్ ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లాడి 217 పరుగులతో పాటు 27 వికెట్లు తీశాడు. కాగా సుందర్ ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.
Congratulations @SunRisers - Say hello to @Sundarwashi5 👌👏#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/QQ2Y7uFqNA
— IndianPremierLeague (@IPL) February 12, 2022