Anchor Varshini Gives Clarity About Her Marriage With Hyper Aadi - Sakshi
Sakshi News home page

Hyper Aadi Varshini: పెళ్లి గురించి అడిగితే.. అమ్మతో మాట్లాడమని!

Aug 14 2023 2:55 PM | Updated on Aug 14 2023 3:29 PM

Anchor Varshini Clarify Wedding With Hyper Aadi - Sakshi

నటి, యాంకర్ వర్షిణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేస్తున్న రానీ గుర్తింపు టీవీ షోలతో సంపాదించింది. ఢీ డ్యాన్స్ షోతో పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తూ పేరు తెచ్చుకుంది. అయితే ఈమె ప్రేమ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పుడు అలానే ప్రశ్న ఎదురవగా దానిపై క్లారిటీ ఇచ్చేసింది.

హైపర్ ఆదితో పెళ్లి?
గతంలో కమెడియన్ హైపర్ ఆదితో కలిసి వర్షిణి.. డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసింది. అలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో నిజంగానే రిలేషన్‌లో ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వర్షిణి మాట్లాడుతూ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ మొన్నీ మధ్య మరోసారి వర్షిణిని హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. దీనిపై తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించిన వర్షిణి.. ఎమోజీలు పోస్ట్ చేసి అలాంటిదేం లేదని చెప్పకనే చెప్పేసింది.

(ఇదీ చదవండి: అమలా పాల్‌ ఒక చెత్త హీరోయిన్‌: యంగ్ హీరో)

అమ్మతో మాట్లాడు..!
ఇకపోతే ఇదే చాట్ డిస్కషన్‌లో భాగంగా ఓ నెటిజన్.. పెళ్లి చేసుకుందామని వర్షిణితో అన్నాడు. దీనిపై ఫన్నీగా స్పందించిన ఈభామ.. తన అమ్మతో మాట్లాడమని చెప్పింది. ఇదంతా పక్కనబెడితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వర్షిణి పెళ్లి ఎక్కువగా డిస్కషన్‌లోకి వస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ టైంలో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌తో షికార్లు చేసిందని మాట్లాడుకున్నారు. 

ఇక ఇప్పుడేమో పలు ఎంటర్ టైన్‌మెంట్ షోలు చేసే డైరెక్టర్‌తో యాంకర్ వర్షిణి ప్రేమలో ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందుకే ఈ మధ్య కాలంలో వర్షిణి పెళ్లి గురించి తెగ రూమర్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగితే గానీ అసలు విషయం ఏంటో తెలీదు.

(ఇదీ చదవండి: మెగాస్టార్‌కు సర్జరీ.. సినిమాలకు బ్రేక్‌?!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement