అతడిని ఎందుకు ఎంపిక చేశారు? కుల్దీప్ యాదవ్ కన్న తోపు స్పిన్నరా? అసలు రోహిత్ శర్మ, గంభీర్‌కు ఏమైంది? ఇవన్నీ న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడంపై మాజీలు సంధించిన విమర్శల బాణాలు. అయితే మ్యాచ్ ఆరంభం తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సుందర్‌ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి.
45 నెలల తర్వాత..
కివీస్ తొలి టెస్టు ఓటమి అనంతరం మిగిలిన రెండు టెస్టులకు అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను భారత జట్టులోకి బీసీసీఐ చేర్చింది. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సుందర్ అర్ధాంతరంగా పుణేలో టీమిండియాతో చేరాడు. అయితే అతడిని కేవలం బ్యాకప్‌గానే తీసుకున్నారని అంతా భావించారు.
కానీ రెండో టెస్టుకు టీమిండియా మెనెజ్‌మెంట్ తుది జట్టులో వాషీకి చోటిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్‌ను తీసుకురావడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు. అయితే 45 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అందరి అంచనాలను తలకిందలు చేశాడు.
ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశాడు. బంతిని గింగరాలు తిప్పుతూ న్యూజిలాండ్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి స్పెల్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సుందర్.. రెండో స్పెల్‌లో రవీంద్రను ఔట్ చేసి తన వికెట్ల వేటను మొదలు పెట్టాడు.
ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. సుందర్ ఈ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేయడం విశేషం. అంతేకాకుండా టెస్టుల్లో ఈ తమిళ తంబీ ఐదు వికెట్ల కంటే ఎక్కువ పడగొట్టడం ఇదే తొలిసారి.
కివీస్@259
ఇక ఈ మ్యాచ్‌లో పర్యాటక కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రచిన్ రవీంద్ర(65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో సుందర్‌తో పాటు మరో తమిళనాడు స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.
🚨 WASHINGTON SUNDAR PRODUCE THE BALL OF THE SERIES 🚨 pic.twitter.com/vLvo4ipYAY
— Johns. (@CricCrazyJohns) October 24, 2024
Comments
Please login to add a commentAdd a comment