పుణే వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(10), యశస్వీ జైశ్వాల్(6) పరుగులతో ఆజేయంగా ఉన్నారు.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నిరాశపరిచాడు. 9 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. కివీస్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఏడేసిన సుందర్..
ఇక ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 7 వికెట్లతో సుందర్ సత్తాచాటాడు. కివీస్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే (76; 141 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment