IPL 2023, SRH Vs DC: Washington Sundar Picks Three Wickets In An Over Against Delhi Capitals, Video Viral - Sakshi
Sakshi News home page

#Washington Sundar: హమ్మయ్య.. ఎట్టకేలకు సాధించాడు! సన్‌రైజర్స్‌కు ఇక చాలు

Published Mon, Apr 24 2023 8:37 PM | Last Updated on Tue, Apr 25 2023 11:02 AM

Washington Sundar strikes thrice in an over - Sakshi

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఎట్టకేలకు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన సుందర్‌..28 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ మూడు వికెట్లు కూడా ఒకే ఓవర్‌లో పడగొట్టడం విశేషం.

ఢిల్లీ ఇన్నింగ్స్‌ 8 ఓవర్‌ వేసిన సుందర్‌.. డేవిడ్‌ వార్నర్‌, సర్పరాజ్‌ ఖాన్‌ అమాన్‌ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. తన తొలి ఓవర్‌లో 13 పరుగులిచ్చిన సుందర్‌.. ఆతర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో సుందర్‌ వికెట్లు పడగొట్టడం ఇదే తొలి సారి కావడం గమానార్హం. తొలి ఆరు మ్యాచ్‌ల్లో సుందర్‌ ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయాడు.

ఇక వరుసగా విఫలమకావడంతో సుందర్‌పై సన్‌రైజర్స్‌ అభిమానులు తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు సుందర్‌ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. దీంతో # వాషింగ్టన్‌ సుందర్‌ అనే కీవర్డ్‌ ట్విటర్‌లో ట్రెం‍డ్‌ అవుతోంది.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. రెండో బౌలర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement