![Dinesh Karthik On KL Rahul-Washington Sundar Fielding Blunders - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/5/DInesh.jpg.webp?itok=LcT53-52)
బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓటమి పాలవడంపై టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తుందని తాను అనుకోలేదన్నాడు. కేఎల్ రాహుల్ వదిలేసిన క్యాచ్ను సుందర్ పట్టేందుకు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించాడు. కేవలం ఫీల్డింగ్ వైఫల్యం వల్లే ఓడిందని దీనేష్ కార్తీక్ అన్నాడు.
చివరి ఓవర్లో హసన్ ఇచ్చిన క్యాచ్ను రాహుల్ పట్టి ఉంటే బాగుండేదన్నాడు. అయితే అతను వదిలేసినా.. పక్కనే ఉన్న సుందర్ బంతిని పట్టుకునేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించాడు. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ వల్ల తాను అసహనానికి గురైనట్లు చెప్పాడు. బ్యాటింగ్లోనూ గొప్పగా ఆడలేదని తెలిపాడు. చివరి ఓవర్లో ఒత్తిడి కారణంగా కొన్ని బౌండరీలు వదిలేసి ఉండవచ్చని కార్తీక్ చెప్పుకొచ్చాడు.
చదవండి: షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment