Vijay Hazare Trophy 2021-22: Dinesh Karthik and Washington Sundar Return to Tamil Nadu Squad - Sakshi
Sakshi News home page

Dinesh Karthik: మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్

Published Wed, Nov 24 2021 9:38 AM | Last Updated on Wed, Nov 24 2021 7:12 PM

Tamil Nadu announce squad for Vijay Hazare Trophy Dinesh Karthik Washington Sundar return - Sakshi

Tamil Nadu announce squad for Vijay Hazare Trophy Dinesh Karthik Washington Sundar return: త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫి కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 20 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఇక వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, ఆల్-రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. కాగా జూన్‌లో ఇంగ్లండ్‌కు పర్యటనకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్..  చేతి వేలి గాయంతో మొదటి టెస్టుకు ముందు జట్టునుంచి తప్పుకున్నాడు.

చదవండి: IND-A Vs SA-A: తొలి రోజు భారత్‌పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా...

ఇక ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు పాల్గొనలేదు. అయినప్పటికీ కర్ణాటకపై ఫైనల్లో విజయం సాధించి ట్రోఫీను తమిళనాడు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా విజయ్ హజారే ట్రోఫి డిసెంబర్‌ 8 నుంచి ప్రారంభకానుంది.

తమిళనాడు జట్టు: విజయ్ శంకర్ (కెప్టెన్‌), ఎన్ జగదీశన్, దినేష్ కార్తీక్, సి హరి నిశాంత్, ఎం షారుక్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ఎం అశ్విన్, సందీప్ వారియర్, ఎంఎస్ వాషింగ్టన్ సుందర్, ఎం సిద్ధార్థ్, బి సాయి సుదర్శన్, వి గంగా శ్రీధర్ రాజు, ఎం మహమ్మద్, జె కౌసిక్, పి శరవణ కుమార్, ఎల్ సూర్యప్రకాష్, బి ఇంద్రజిత్, ఆర్ సంజయ్ యాదవ్, ఎం కౌశిక్ గాంధీ, ఆర్ సిలంబరసన్.

చదవండి: ఐపీఎల్‌-2022 షెడ్యూల్‌ ఫిక్స్‌.. ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement