PC: IPL.COM
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరు మారలేదు. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా రెండో ఓటమిని ఎస్‌ఆర్‌హెచ్ చవి చూసింది. శుక్రవారం వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్ అందుకు తగ్గట్టు ఏ దశలోను ప్రదర్శన చేయలేకపోయింది.
ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ టెస్టు మ్యాచ్ కంటే దారుణంగా కొనసాగింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఆడిన ఆట తీరు అయితే అభిమానులకు చిరాకు తెప్పించింది. 9 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 55/4 ఉన్న సమయంలో సుందర్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన సుందర్ టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కనీసం ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం కూడా చేయలేదు.
ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 28 బంతులు ఎదుర్కొన్న సుందర్ 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక కీలక సమయంలో వచ్చి జిడ్డు బ్యాటింగ్ చేసిన సుందర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
సుందర్ టీ20లకు పనికిరాడని, టెస్టు మ్యాచ్‌లు ఆడుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంతమంది సుందర్ స్థానంలో సమద్‌ను బ్యాటింగ్ పంపింటే పరిస్థితి మరో విధంగా ఉండేది అని కామెంట్లు చేస్తున్నారు. ఇక కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఐడైన్ మార్‌క్రమ్ కూడా గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు.
చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్ కూడా! ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు
Boundary kottu
— Rolex (@Marshall_Jim12) April 7, 2023
Washington Sundar - pic.twitter.com/KWahPRxHng
Wow 😲 what a player man 🔥#washingtonsundar #SRHvsLSG
— Hidden_Star (@blackblue8855) April 7, 2023
Legend player 😂 pic.twitter.com/YKompQ3fSQ
An all-round @krunalpandya24 performance and a clinical @LucknowIPL chase at home to move to the 🔝 of the table 👌🏻👌🏻 #TATAIPL
— IndianPremierLeague (@IPL) April 8, 2023
We have got the #LSGvSRH clash summed up for you 🔽 pic.twitter.com/d0m9foUkqf
Comments
Please login to add a commentAdd a comment