ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన ఎస్‌ఆర్‌హెచ్.. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. 183 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు విఫలమయ్యారు.
ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అభిషేక్ శర్మ ఏకంగా 31 పరుగులిచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ స్పందించాడు. బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు అదనంగా చేసే ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది అని మార్‌క్రమ్ అన్నాడు.
"182 పరుగులు మంచి స్కోర్ అని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ డిఫెండ్ చేసుకోలేకపోయాము. మేము తొలుత బ్యాటింగ్ బాగా చేశాం. ఒక మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోర్ బోర్డ్‌ను 200 పరుగులు దాటించే ఉంటే బాగుండేది. మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ వికెట్ చాలా నెమ్మదించింది. అందుకు తగ్గట్టుగా ఆరంభం నుంచి మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
అయితే స్టోయినిష్, పూరన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు క్రీజులో ఉండడంతో మా బౌలర్లకు కాస్త ఒత్తిడికి లోనయ్యారు. ఫిలిప్స్ అద్భుతంగా బౌలింగ్‌లో చేయడంతో నేను బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇక మా చివరి మూడు మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్‌క్రమ్ పేర్కొన్నాడు.
కాగా మార్కండే వంటి రెగ్యూలర్ స్పిన్నర్ ఉన్నప్పటకీ అభిషేక్ శర్మతో బౌలింగ్ చేయించిన మార్‌క్రమ్‌పై సన్‌రైజర్స్ అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. మార్‌క్రమ్ చెత్త కెప్టెన్సీ వల్లే ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోయింది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: ధోని కెప్టెన్సీపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment