PC: IPL.com
ఐపీఎల్-2023ను సన్‌రైజర్స్ హైదారాబాద్ ఓటమితో ఆరంభించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ పరాజయం పాలైంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్ తన తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో వేదికగా లక్నోసూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్ అందింది.
ఆ జట్టు కెప్టెన్, ప్రోటీస్ స్టార్ ఆటగాడు ఐడైన్ మార్‌క్రమ్‌తో పాటు హెన్రిచ్ క్లాసన్, మార్కో జానెసన్ ఆరెంజ్ ఆర్మీ క్యాంప్‌లో కలిశారు. వీరు ముగ్గురు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ కారణంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమయ్యారు. కాగా వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
నెదార్లాండ్స్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన మార్‌క్రమ్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక వీరి రాకతోనైనా ఎస్‌ఆర్‌హెచ్ తల రాత మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు వీరితో పాటు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్(లక్నో సూపర్ జెయింట్స్), మిల్లర్(గుజరాత్ టైటాన్స్), రబాడ(పంజాబ్ కింగ్స్), నోర్జే(ఢిల్లీ) కూడా భారత్‌కు చేరుకున్నారు.
చదవండి: IPL 2023-PANT: గుజరాత్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పోరు.. పంత్ వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment