PC: IPL.com
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 121 పరుగులు మాత్రమే చేయగల్గింది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అన్మోల్‌ప్రీత్ సింగ్(31), త్రిపాఠి(35), సమద్(21) పరుగులతో పర్వాలేదనపించారు. ఇక కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన ఐడైన్ మార్‌క్రమ్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. మరోవైపు లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో చెలరేగాడు. 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే చేధించింది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఓటమికి కారణం తమ బ్యాటింగ్ వైఫల్యమే అని మార్‌క్రమ్ అంగీకరించాడు.
"మేము బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. మేము నిర్ణీత ఓవర్లలో 150 నుంచి 160 పరుగులు చేయడానికి ప్రయ్నత్నించాము. కానీ మేము అనుకున్న టార్గెట్‌కు చేరుకోలేకపోయాం. అయితే లక్నో వికెట్ కూడా బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించలేదు. కానీ మేము ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది.
ఈ పరిస్థితులకు అనుగుణంగా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము మరిన్ని పరుగులు చేసి ఉంటే.. మా బౌలర్లు కచ్చితంగా మ్యాచ్‌ను మలుపు తిప్పేవారు. ఇక మా తర్వాతి హోం మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతున్నాం. అక్కడ మా పొరపాట్లను సరిదిద్దుకుంటాం అని ఐడైన్ మార్‌క్రమ్ పేర్కొన్నాడు.
ఇక పిచ్ బ్యాటింగ్‌కు సహకరించలేదు అని మార్‌క్రమ్ చేసిన వాఖ్యలపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు మండిపడుతున్నారు. బ్యాటింగ్‌లో కొంచెం కూడా దూకుడు లేకుండా ఆడిందే కాక, వికెట్ సహకరించలేదు అని చెప్పడానికి సిగ్గులేదు అంటూ ట్రోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment