IPL 2023: Shock For SRH, Washington Sundar Ruled Out Of Remaining Tournament, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2023-Washington Sundar: సన్‌రైజర్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆటగాడు టోర్నీ మొత్తానికి దూరం!

Published Thu, Apr 27 2023 11:57 AM | Last Updated on Thu, Apr 27 2023 5:07 PM

Sunrisers Hyderabad as Washington Sundar ruled out of remaining tournament - Sakshi

PC:IPL.com

ఐపీఎల్‌-2023లో ఓటుముల బాధలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మోకాలి గాయం కారణంగా మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

"మోకాలి గాయం కారణంగా ఐపీఎల్‌-2023 సీజన్‌ నుంచి తప్పుకున్నాడు" అని ఎస్‌ఆర్‌హెచ్‌ ట్విటర్‌లో పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన సుందర్‌.. బ్యాటింగ్‌లో 24 పరుగులు చేశాడు.

అయితే ఇప్పటి  వరకు 7 మ్యాచ్‌లు ఆడిన సుందర్‌ మూడు వికెట్లతో పాటు 60 పరుగులు సాధించాడు. కాగా తొలి ఆరు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన సుందర్‌.. ఢిల్లీ మ్యాచ్‌తో అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. అయితే అంతలోనే అతడు గాయం కారణంగా దూరం కావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి.


చదవండి: Ind Vs Aus WTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement