India tour of Bangladesh, 2022 - 2nd ODI- Rohit Sharma Comments: ‘‘అదృష్టవశాత్తూ నా చేతి వేలికి ఫ్రాక్చర్ కాలేదు. బ్యాటింగ్ చేయగలిగాను. కానీ... బంగ్లాదేశ్ 69 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న స్థితి నుంచి.. 270 వరకు స్కోరు చేయగలగడం కచ్చితంఆ మా బౌలర్ల వైఫ్యలమే.
ఆరంభంలోనే మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే, మిడిల్ ఓవర్లలో.. ఆఖర్లో మా వాళ్ల ప్రదర్శన నిరాశపరిచింది. గత మ్యాచ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే పునరావృతమైంది. లోపాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
ఏదేమైనా మోహదీ, మహ్మదుల్లా అద్భుత భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. వాళ్ల జోడీని విడదీయడం మాతరం కాలేదు. ఇలాంటి సమయాల్లో ఒత్తిడిని అధిగమించి ఎలా ముందుకు సాగాలో పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
వన్డే మ్యాచ్ అంటేనే భాగస్వామ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఇద్దరు బ్యాటర్ల మధ్య సమన్వయం కుదిరి.. పట్టుదలగా నిలబడ్డారంటే జట్టును విజయతీరాలకు చేర్చగలరు. ఈరోజు మెహదీ, మహ్మదుల్లా అదే పని చేశారు.
సగం సగం ఫిట్‌నెస్‌తో..
మా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. టీమిండియాకు ఆడుతున్నారంటే వందకు వంద శాతం ఫిట్‌గా ఉండాలి. సగం సగం ఫిట్‌నెస్‌తో మ్యాచ్‌లు ఆడలేరు కదా! లోపాలన్నిటిని సవరించుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ఆ దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లా చేతిలో పరాజయం అనంతరం మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్‌తో బుధవారం నాటి రెండో వన్డేలో ఓటమి నేపథ్యంలో భారత్ 0-2తో సిరీస్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ మహ్మదుల్లా, మిరాజ్ జోడీ టీమిండియా బౌలర్లకు పీడకలను మిగిల్చింది.
కెరీర్‌లో తొలి సెంచరీ!
నిజానికి ఆరంభంలో సీమర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌కు బంగ్లాదేశ్ 69/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో మహ్ముదుల్లా, ఎనిమిదో స్థానంలో దిగిన మెహదీ హసన్ ఏడో వికెట్‌కు 148 పరుగులు జోడించి భారీస్కోరుకు బాట వేశారు. కడదాకా అజేయంగా నిలిచిన మిరాజ్ 83 బంతుల్లో (8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ ఆఖరి బంతికి పరుగు తీసి వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు.
అయ్యర్, అక్షర్ భేష్
భారత ఇన్నింగ్స్ మొదలైన తొలి బంతికి కోహ్లి (4) బౌండరీ కొట్టాడు. కానీ ఇబాదత్ తర్వాతి ఓవర్లో క్లీన్‌బౌల్డయ్యాడు. మరుసటి ఓవర్లో ధావన్, కాసేపటికి సుందర్, రాహుల్ కూడా అవుటయ్యారు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. 172/4 స్కోరుతో జట్టు లక్ష్యం చేరే దారిలో కనిపించింది కానీ అదే స్కోరు వద్ద అయ్యర్‌ను మిరాజ్ అవుట్ చేసి భారత్‌ను కష్టాల్లో నెట్టాడు.
రోహిత్ ధనాధన్...
శార్దుల్ (7), చహర్ (11), బంతులు వృథా చేసి అవుటయ్యారు. 45.1 ఓవర్లలో భారత్ స్కోరు 213/8! ఇంకా 29 బంతుల్లో 59 పరుగుల సమీకరణం భారత్‌కు ఓటమిని ఖాయం చేసింది. ఈ దశలో ఫీల్డింగ్‌లో చేతి వేలికి గాయమైన రోహిత్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇబాదత్ 45వ ఓవర్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. కానీ అవతలివైపు సిరాజ్ బంతులు వృథా చేశాడు. 48వ ఓవర్‌నైతే మెయిడిన్ చేశాడు.
12 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన దశలో రోహిత్ రెండు సిక్సర్లు కొట్టాడు. రెండుసార్లు క్యాచ్‌లు నేలపాలై బతికి పోయాడు. మొత్తానికి ఈ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. సిరాజ్ అఖరి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సిన దశలో ముస్తఫిజుర్‌ను రోహిత్ ఎదుర్కొన్నాడు.
2, 3 బంతుల్లో బౌండరీలు కొట్టగా.. నాలుగో బంతికి పరుగు రాలేదు. 2 బంతుల్లో 12 పరుగుల సమీకరణం భారత్‌ను ఊరించింది. ఉత్కంఠ ఉన్నపళంగా పెరిగింది. ఐదో బంతిని రోహిత్ సిక్సర్ కొట్టాడు. ఆఖరి బంతి సిక్స్ కొడితే భారత్‌దే విక్టరీ! కానీ ముస్తఫిజుర్ యార్కర్ వేయడంతో రోహిత్ సిక్స్ కొట్టలేకపోయాడు. 5 పరుగలు తేడాతో భారత్ ఓటమి ఖరారైంది.
చదవండి: Ind VS BAN: వారెవ్వా! రోహిత్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..
Ind Vs Ban: అద్భుత ఇన్నింగ్స్.. అయినా రోహిత్ ‘చెత్త’ రికార్డు! రైనాకు సాధ్యమైంది.. హిట్‌మ్యాన్ మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment