అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్‌ సుందర్‌.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డు | IND Vs ZIM T20 Series: Washington Sundar Won More Player Of The Series Awards Than Player Of The Match Awards | Sakshi
Sakshi News home page

IND Vs ZIM T20 Series: అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్‌ సుందర్‌.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డు

Published Mon, Jul 15 2024 7:17 PM | Last Updated on Mon, Jul 15 2024 7:21 PM

IND VS ZIM T20 Series: Washington Sundar Won More Player Of The Series Awards Than Player Of The Match Awards

టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తాజాగా ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అతను 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అలాగే రెండు సార్లు బ్యాటింగ్‌కు దిగి 28 పరుగులు చేశాడు. మూడో టీ20లో సుందర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

సిరీస్‌ ఆధ్యాంతం బంతితో అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు సుందర్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు వరించింది. ఈ అవార్డు లభించడం సుందర్‌కు ఇది రెండో సారి. కెరీర్‌లో రెండో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించిన అనంతరం సుందర్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల కంటే ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

సుందర్‌ టీ20ల్లో ఒక్క ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును.. అదీ ఇదే జింబాబ్వే సిరీస్‌లో గెలుచుకున్నాడు. ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డుకు ముందు సుందర్‌ ఓసారి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల కంటే ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సుందర్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. సుందర్‌కు ముందు ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.

రీజా హెండ్రిక్స్‌ (సౌతాఫ్రికా)- 3 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు, 1 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

టిమ్‌ సీఫర్ట్‌ (న్యూజిలాండ్‌)- 3 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు, 2 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

అలెక్స్‌ కుసక్‌ (ఐర్లాండ్‌)- 2 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు, 1 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు

ఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement