
రాంచీ వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టి20లో టీమిండియా బౌలర్ వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ చాప్‌మన్‌ను సుందర్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని సుందర్ ఔట్‌సైడ్ దిశగా వేయగా.. చాప్‌మన్ స్ట్రెయిట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సుందర్ ఒకవైపుగా డైవ్‌గా చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
అయితే బంతి కింద తాకిందేమోనని థర్డ్ అంపైర్ పరిశీలించాడు. రిప్లేలో సుందర్ బంతిని అందుకున్నాకే కింద పడినట్లు చూపించింది. దీంతో చాప్‌మన్ ఔట్ అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. కాన్వే 7, గ్లెన్ పిలిప్స్ 2 పరుగులతో ఆడుతున్నారు.
Washington Sundar catch.#INDvsNZ #INDvNZpic.twitter.com/Kr0JsJmNs4
— Abdullah Neaz (@Abdullah__Neaz) January 27, 2023