వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టి20లో తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జాన్సన్ చార్ల్స్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. అయితే బంతి చాలాసేపు గాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో డీప్ మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ 10 నుంచి 15 మీటర్ల దూరం ఎడమవైపుగా పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తి క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో కుల్దీప్ యాదవ్ తన తొలి ఓవర్లోనే వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిది. నికోలస్ పూరన్ 7, రోవ్‌మెన్ పావెల్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ బ్రాండన్ కింగ్ 19 బంతుల్లో 28 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. ఇటీవలే మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) ఫైనల్లో సెంచరీతో మెరిసిన పూరన్ వచ్చీ రాగానే సిక్సర్ల వర్షం కురిపించాడు.
Tilak Varma, A flying debut 🔥
— Johns. (@CricCrazyJohns) August 3, 2023
What a catch...!!!pic.twitter.com/ZPmSrJ9mTd
చదవండి: 'నువ్వు ధోనివి కాదు'.. ఇషాన్ కిషన్ అదిరిపోయే రిప్లై
Comments
Please login to add a commentAdd a comment