
టీమిండియా.. జింబాబ్వే పర్యటనకు ఎంపికై, గాయం కారణంగా జట్టుకు దూరమైన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భారత సెలెక్షన్ కమిటీ మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసింది. సుందర్ స్థానంలో ఆర్సీబీ ఆల్‌రౌండర్, బెంగాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ జింబాబ్వే పర్యటనకు బయల్దేరనున్నట్లు సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్న షాబాజ్.. టీమిండియా తరఫున ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంగా, ఊహించని అవకాశం అతని తలుపు తట్టింది. షాబాజ్.. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున 29 మ్యాచ్‌ల్లో 118 స్ట్రయిక్ రేట్‌తో 279 పరుగులు, 8.58 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మంచి రికార్డే ఉంది. బ్యాటింగ్‌లో 3 శతకాలు, 10 అర్ధశతకాలు.. బౌలింగ్‌లో 7/57 అత్యుత్తమ ప్రదర్శనతో 100కు పైగా వికెట్లు సాధించాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి.
కాగా, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ ఆడుతూ గాయపడ్డ విషయం తెలిసిందే. రాయల్ లండన్ వన్డే కప్‌లో లాంకషైర్ తరఫున ఆడుతున్న సుందర్.. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినప్పుడు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానాన్ని వీడాడు.
చదవండి: అనుకున్నదే అయ్యింది.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..!