India tour of Zimbabwe
-
"ఆల్ ద బెస్ట్ టీమిండియా".. జింబాబ్వే పర్యటనకు బయల్దేరిన శుభ్‌మన్ గిల్ సేన
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయల్దేరింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా నిన్న (జులై 1) సాయంత్రం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. టీ20 వరల్డ్‌కప్ 2024 అనంతరం సీనియర్లు విశ్రాంతి కోరడంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ప్రపంచకప్‌తో ముగియడంతో ఈ పర్యటనకు తాత్కాలిక కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.Team India off to Zimbabwe via Emirates flight from Mumbai. 🇮🇳- Good luck, boys! pic.twitter.com/0yJdocApUX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 1, 2024సీనియర్లకు విశ్రాంతిఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్, సూర్యకుమార్, పంత్, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లి, జడేజా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.TEAM INDIA HAS LEFT FOR ZIMBABWE FOR THE T20I SERIES.- Good luck, Team India. 🇮🇳 pic.twitter.com/iiQUVjlIKA— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024ఈ సిరీస్‌కు వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు. వరల్డ్‌కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా జట్టులో చోటు దక్కించుకన్నారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం/తెలుగు), మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 5 SD & HD ఛానల్‌లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే -
జులై 6 నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటన.. షెడ్యూల్ వివరాలు
టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన వారం రోజుల్లోనే టీమిండియా మరో సిరీస్‌కు సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ నెల (జులై) 6 నుంచి మొదలుకానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్, సూర్యకుమార్, పంత్, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. వరల్డ్‌కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనకు ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం/తెలుగు), మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 5 SD & HD ఛానల్‌లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే -
టీమిండియాను విమర్శించిన పాక్ అభిమానులు.. కనేరియా దిమ్మతిరిగే కౌంటర్!
India Tour Of Zimbabwe 2022- ODI Series- 2nd ODI: జింబాబ్వేతో రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌ను విమర్శించిన పాకిస్తాన్ జట్టు అభిమానుల తీరును ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తప్పుబట్టాడు. టీమిండియా స్థానంలో గనుక పాక్ జట్టు ఉంటే మ్యాచ్‌ను 50వ ఓవర్ల వరకు సాగదీసేదంటూ చురకలు అంటించాడు. కాగా మూడు వన్డేలు ఆడేందుకు కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హరారే వేదికగా శనివారం(ఆగష్టు 20) ఇరు జట్లు రెండో వన్డేలో తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు 161 పరుగులు చేసి 38.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. ఐదు వికెట్లు కోల్పోయి! ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాహుల్ సేన 25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 167 పరుగులు సాధించి జయకేతనం ఎగురువేసింది. అయితే, జింబాబ్వేతో మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితం కావడాన్ని కొంతమంది పాక్ అభిమానులు ట్రోల్ చేశారు. డానిష్ కనేరియా మన జట్టు అయితే! ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ లెగ్‌స్పిన్నర్ డానిష్ కనేరియా.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి గెలుపొందడాన్ని చాలా మంది పాకిస్తానీ అభిమానులు విమర్శించారు. నిజానికి.. భారత ఆటగాళ్లు పూర్తి దూకుడైన ఆటతో ముందుకు సాగారు. సుమారు 25 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు. మన జట్టు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే గనుక 50 ఓవర్ల పాటు తంటాలు పడేది’’ అని కనేరియా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా మొదటి వన్డేలో 10 వికెట్లు, రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు జింబాబ్వేతో సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య సోమవారం(ఆగష్టు 22) నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. అంతా మీరే చేశారు! ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టోర్నీకి ముందు పాక్ కీలక బౌలర్ షాహిన్ ఆఫ్రిది గాయపడిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును కనేరియా విమర్శించాడు. విశ్రాంతి ఇవ్వకుండా అతడిని కష్టపెట్టారని.. అందుకే మెగా ఈవెంట్‌కు ముందు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుండగా.. ఆ మరుసటి రోజు చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. చదవండి: Ind Vs Zim: పాపం.. కనీసం ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే! Sanju Samson: అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అంతే! నాకైతే గొప్పగా అనిపిస్తోంది! -
Ind Vs Zim: ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే!
India tour of Zimbabwe, 2022- 3rd ODI: అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం కోసం రాహుల్ త్రిపాఠి... వన్డేల్లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చేందుకు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి తొలిసారి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో జాతీయ జట్టుకు ఎంపికైనా తుది జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. ప్చ్.. రుతురాజ్ కూడా! ఇక గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన రుతు.. వన్డేల్లో ఆడే అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. గతేడాది టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టుకు ఎంపికైనప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. కాగా టీమిండియా జింబాబ్వే పర్యటన నేపథ్యంలో వీరిద్దరికి బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో ఇరు ఆటగాళ్ల అభిమానులు సంబరపడ్డారు. రాహుల్ త్రిపాఠి- రుతురాజ్ గైక్వాడ్(PC: BCCI) కానీ, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో వీరిద్దరికీ నిరాశే ఎదురైంది. ఓపెనర్ల విభాగంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు అందుబాటులో ఉండటంతో రుతురాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అవకాశం దక్కుతుందా! అదే విధంగా సంజూ శాంసన్, దీపక్ హుడా వంటి బ్యాటర్లు ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో రాహుల్ త్రిపాఠిని పరిగణనలోకి తీసుకునే అవసరమే రాలేదు. అయితే, ఇప్పటికే మొదటి, రెండు వన్డేల్లో వరుసగా 10 వికెట్లు, ఐదు వికెట్ల తేడాతో జింబాబ్వే మీద రాహుల్ సేన గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న నేపథ్యంలో నామమాత్రపు మూడో వన్డేలోనైనా వీరికి అవకాశం దక్కుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రాబిన్ ఊతప్ప(PC: BCCI) ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠికి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించాడు. టీమిండియా- జింబాబ్వే మధ్య ఆఖరి వన్డేకు ముందు ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అన్యాయం చేసినట్లే! ‘‘మూడో వన్డేలో భాగంగా దీపక్ చహర్ తిరిగి జట్టులోకి వస్తాడు. ప్రసిద్ కృష్ణకు విశ్రాంతినిస్తే.. ఆవేశ్ ఖాన్ జట్టులోకి రావొచ్చు. సిరాజ్‌కు కూడా బ్రేక్ ఇచ్చి శార్దూల్‌ను ఆడించొచ్చు. ఫాస్ట్‌బౌలర్లను రొటేషన్ విధానంలో ఆడించేందుకు వాళ్లు సిద్ధమయ్యారు కాబట్టి మనం ఈ మార్పులు చూడొచ్చు. ఇక బ్యాటింగ్ విభాగానికొస్తే... నాకు తెలిసి మేనేజ్మెంట్ మరీ ఎక్కువ మార్పులు చేయకపోవచ్చు. బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌కు అరంగేట్రం చేసే అవకాశం రావొచ్చు. ఇక రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి సైతం అరంగేట్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వాళ్లిద్దరికీ అవకాశం రాలేదంటే అన్యాం జరిగినట్లే!’’ అని ఊతప్ప పేర్కొన్నాడు. ఈ పర్యటన తర్వాత.. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో షాబాజ్ అహ్మద్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది బీసీసీఐ. కాగా హరారే వేదికగా సోమవారం(ఆగష్టు 22) టీమిండియా- జింబాబ్వే మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు జింబాబ్వే పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత ఆసియా కప్-2022 టోర్నీలో ఆగష్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: Sanju Samson: అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అంతే! నాకైతే గొప్పగా అనిపిస్తోంది! -
ధవన్‌ను ఇంతలా అవమానించడం సరికాదు.. వేరేవాళ్లయ్యుంటే రచ్చరచ్చ జరిగేది..!
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా తొలుత శిఖర్ ధవన్ పేరును ప్రకటించిన భారత సెలెక్టర్లు.. కొద్ది రోజుల తర్వాత కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే ధవన్‌ను రాహుల్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కొనసాగవలసిందిగా కోరారు. ధవన్‌ను అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన ఈ ఉదంతంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుండగా, తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. ధవన్ విషయంలో సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టులో సీనియర్ అయిన ధవన్‌ను అంతలా అవమానించడం సరికాదని దుయ్యబట్టాడు. రాహుల్ ఫిట్‌గా ఉన్నాడన్న నివేదికలు ఆలస్యంగా వచ్చి ఉంటే, ధవన్ నాయకత్వంలో రాహుల్ ఆడితే కొంపమునిగేదేం కాదని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు విండీస్ సిరీస్‌లో టీమిండియాను 3-0 తేడాతో గెలిపించిన ధవన్‌ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం సమంజసం కాదని అన్నాడు. సరైన కమ్యూనికేషన్‌తో ఈ పరిస్థితి తలెత్తకుండా నివారించి ఉండవచ్చని తెలిపాడు. ఆసియా కప్‌కు ముందు రాహుల్‌కు ప్రాక్టీస్ అవసరం కాబట్టి, అతన్ని జట్టులో సభ్యుడిగా ఎంపిక చేయడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా అకస్మాత్తుగా కెప్టెన్సీ తొలగించడం ధవన్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ విషయంలో సరికాదని చెప్పుకొచ్చాడు. ధవన్ కూల్ కాండిడేట్ కాబట్టి, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయలేదని, వేరే వాళ్ల విషయంలో ఇలాగే జరిగి ఉంటే పెద్ద రచ్చే అయ్యేదని అభిప్రాయపడ్డాడు. చదవండి: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్.. వైరల్ వీడియో -
విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్.. వైరల్ వీడియో
3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా హరారే వేదికగా రేపు (ఆగస్ట్ 18) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ శిఖర్ ధవన్ తమ మ్యాచ్ ప్రణాళికలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు శిఖర్ ధవన్ ప్రదర్శించిన హావభావాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. pic.twitter.com/FEKRNyFZBW — Guess Karo (@KuchNahiUkhada) August 16, 2022 ఓ స్థానిక రిపోర్టర్ అడిగిన ప్రశ్న అర్ధం కాక ధవన్ బిక్క మొహంతో ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ రిపోర్టర్ ధవన్‌ను ఏం అడిగాడంటే.. "పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే లాంటి జట్టుతో ఆడటం మీకు ఏ మేరకు లాభిస్తుంది. ఇటీవలికాలంలో జింబాబ్వే మీతో పెద్దగా ఆడింది లేదు. వారిపై గెలవడం సులవునేనని భావిస్తున్నారా?" అని ప్రశ్నించారు. రిపోర్టర్ తన యాసలో వేగంగా ప్రశ్నించడంతో అయోమయానికి గురైన ధవన్.. బిక్క మొహం పెట్టాడు. ప్రశ్నను మరోసారి రిపీట్ చేయాలని రిపోర్టర్‌ను కోరాడు. ఈ సారి రిపోర్టర్ అడిగిన ప్రశ్నను ఏకాగ్రతతో విన్న ధవన్.. తగు సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా, జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు తొలుత శిఖర్ ధవన్‌నే కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అనంతరం కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో అతడికి బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్సీ దూరమైనప్పటికీ ధవన్ ఎంతో హుషారుగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం విశేషం. చదవండి: కశ్మీర్ లీగ్ ఎఫెక్ట్: హర్షల్ గిబ్స్‌పై వేటు.. గంగూలీపై ప్రశంసలు -
సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆర్సీబీ ఆల్‌రౌండర్
టీమిండియా.. జింబాబ్వే పర్యటనకు ఎంపికై, గాయం కారణంగా జట్టుకు దూరమైన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భారత సెలెక్షన్ కమిటీ మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేసింది. సుందర్ స్థానంలో ఆర్సీబీ ఆల్‌రౌండర్, బెంగాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ జింబాబ్వే పర్యటనకు బయల్దేరనున్నట్లు సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఓ మోస్తరు ప్రదర్శన చేస్తున్న షాబాజ్.. టీమిండియా తరఫున ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంగా, ఊహించని అవకాశం అతని తలుపు తట్టింది. షాబాజ్.. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 29 మ్యాచ్‌ల్లో 118 స్ట్రయిక్ రేట్‌తో 279 పరుగులు, 8.58 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మంచి రికార్డే ఉంది. బ్యాటింగ్‌లో 3 శతకాలు, 10 అర్ధశతకాలు.. బౌలింగ్‌లో 7/57 అత్యుత్తమ ప్రదర్శనతో 100కు పైగా వికెట్లు సాధించాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. కాగా, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ ఆడుతూ గాయపడ్డ విషయం తెలిసిందే. రాయల్ లండన్ వన్డే కప్‌లో లాంకషైర్ తరఫున ఆడుతున్న సుందర్.. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినప్పుడు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానాన్ని వీడాడు. చదవండి: అనుకున్నదే అయ్యింది.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..! -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న టీమిండియా
Team India Celebrates Independence Day In Harare: 3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా.. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అక్కడే ఘనంగా జరుపుకుంది. జట్టు సభ్యులతో పాటు కోచింగ్, సహాయక సిబ్బంది అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో ఈ సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేఎల్ రాహుల్ నాయకత్వంలో టీమిండియా సభ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత బృంద సభ్యులంతా జాతీయ జెండా ముందు నిల్చొని ఫోటోలు దిగారు. ఇదిలా ఉంటే, జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఈ నెల (ఆగస్ట్) 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా నేరుగా యూఏఈ వెళ్లి ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా టీమిండియా ఈనెల 28న తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. చదవండి: 'విండీస్ సిరీస్‌లో అతడు అదరగొట్టాడు.. అయినప్పటికీ ఓపెనర్‌గా నో ఛాన్స్' -
అనుకున్నదే అయ్యింది.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..!
Washington Sundar Ruled Out Of Zimbabwe Tour: ఇంగ్లండ్‌లో దేశవాళీ మ్యాచ్‌లాడుతున్న భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. దీంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే టోర్నీ రాయల్ లండన్ కప్‌లో లాంకషైర్ తరఫున సుందర్ ఆడుతున్నాడు. ఈ నెల 10న వోర్సస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసినపుడు అతని ఎడమ భుజానికి గాయమైంది. నొప్పితో అతను ఉన్నపళంగా మైదానం వీడాడు. తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి దిగలేదు. ఆదివారం హాంప్‌షైర్‌తో జరిగిన పోరులోనూ అతను బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతని గాయం తీవ్రమైంది అయితే జింబాబ్వే పర్యటనకు వెళ్లడు. అటునుంచి నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వచ్చి పునరావాస శిబిరంలో పాల్గొనే అవకాశముంది. ఈనెల 18 నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ పాల్గొంటుంది. -
జింబాబ్వే పర్యటన కూడా రద్దు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 ఉధృతి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో పర్యటనను పక్కన పెట్టింది. ఇప్పటికే శ్రీలంకతో సిరీస్‌కు ‘నో’ చెప్పిన భారత్... ఆగస్టులో జరగాల్సిన జింబాబ్వే పర్యటనను కూడా రద్దు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో భారత్ 3 వన్డేలు ఆడాల్సి ఉంది. కరోనా కారణంగా నెలకొని ఉన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆట సాధ్యం కాదని స్పష్టం చేసింది. మరోవైపు భారత జట్టుకు కూడా ఇప్పట్లో శిక్షణా శిబిరం జరిగే అవకాశం కనిపించడం లేదు. ‘మైదానంలో సాధన చేసేందుకు అనుకూలమైన, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయని భావించినప్పుడే బోర్డు కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు శిక్షణా శిబిరం నిర్వహిస్తాం. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ను మొదలు పెట్టాలని బీసీసీఐకి కూడా ఉంది. అయితే కరోనాను కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం, రాష్ట్రాలు చేపడుతున్న చర్యలకు మేం విఘాతం కల్పించకూడదు. కాబట్టి తొందరపాటుతో ఏ నిర్ణయం కూడా తీసుకోం’ అని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. కోవిడ్–19కు సంబంధించి నిపుణులతో మాట్లాడుతూ బీసీసీఐ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం చివరిసారిగా మార్చిలో టీమిండియా మైదానంలోకి దిగింది. ఇందులో వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కాగా... కరోనా కారణంగా మిగతా రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. రాజ్‌పుత్ నిరాశ... మరోవైపు ఈ పర్యటన రద్దుతో జింబాబ్వే జట్టు హెడ్ కోచ్, భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జింబాబ్వే జట్టు మంచి అవకాశం కోల్పోయిందని ఆయన అన్నారు. ‘జింబాబ్వే క్రికెట్ జట్టుకు ఈ పరిణామం తీవ్ర నిరాశ కలిగించింది. ఎందుకంటే సమీప భవిష్యత్తులో వారికి మళ్లీ భారత్‌తో తలపడే అవకాశం రాకపోవచ్చు. ప్రపంచంలోని ప్రతీ జట్టు భారత్‌లాంటి అత్యుత్తమ టీమ్‌తో ఆడాలని కోరుకుంటుంది. కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ఆటగాళ్లతో తలపడే అవకాశం వారికి చేజారింది’ అని రాజ్‌పుత్ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా జింబాబ్వేకు రాజ్‌పుత్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
'టమాటో చెట్టుకు ఉరి వేసుకోవాలనుకున్నా'
హరారే: చాలాసార్లు ఓటమి మనుషిని కుంగదీస్తుంది. కొన్నిసార్లైతే చనిపోవాలని కూడా అనిపిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న క్రికెట్ లాంటి ఆటల్లోనైతే టెన్షన్ భరించడం చాలా కష్టం. భారీ ఆశలు పెట్టుకున్న తన జట్టు పేక మేడలా కూలిపోతుంటే, ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తింటోంటే.. ఏ శిక్షకుడికైనా రోషం పొడుచుకొస్తుంది. ఆ కోపం అదుపుతప్పినప్పుడు ఆత్మహత్యచేసు కోవాలని కూడా పిస్తుంది.. జింబాబ్వే కోచ్ ముకాయా ఎన్తిని లాగా. భారత్ పై జింబాబ్వే వరుస ఓటములు జీర్ణించుకోలేకపోతున్నానన్న ఎన్తిని.. 'ఈ ఓటమి చూశాక నాకు బతకాలని లేదు. టమాటా చెట్టుకు ఉరి వేసుకుని చచ్చిపోదామనుకున్నా. స్టేడియం బయట టమాటో చెట్లు ఉండిఉంటే.. ఈ పాటికి మీరు ఎన్తిని మరణవార్తలు రాసేవారు' అంటూ ఒక్కతీరుగా ఆగ్రహావేశానికి లోనయ్యాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ గా ప్రపంచంలోని ఇతర బ్యాట్స్ మన్లను గడగడలాడించిన ఎన్తిని.. ఇంతలా కుంగిపోవడానికి బలమైన కారణంఉంది. (చదవండి: క్లీన్ స్వీప్ లాంఛనమ!) జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత్ మూడు వన్ డేల సిరీస్ ను మరో మ్యాచ్ ఉందనగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్ లో జింబాబ్వే కనీస పోరాటం చేయకుండా చేతులెత్తేయడాన్ని ఆ దేశాభిమాను జీర్ణించుకోలేకపోయారు. 'ఈ ఘోరఅవమానాన్ని మేం చూడలేం' అంటూ స్టేడియంలోనే పెద్ద పెట్టున నినాదాలు చేసి, ఫ్లకార్డులు చూపారు. ఓట్ ఫీల్డ్ లో కూర్చుని మ్యాచ్ చూస్తోన్న ఎన్తినిని ఆ అభిమానుల చర్యలు బాధపెట్టాయట. అందుకే టొమాటో చెట్టుకు ఉరివేసుకుందామనుకున్నాడట! వాట్ మోర్ రాజీనామా తర్వాత ఎన్తిని జింబాబ్వే తాత్కాలిక కోచ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.