ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయల్దేరింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా నిన్న (జులై 1) సాయంత్రం ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. టీ20 వరల్డ్‌కప్ 2024 అనంతరం సీనియర్లు విశ్రాంతి కోరడంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ప్రపంచకప్‌తో ముగియడంతో ఈ పర్యటనకు తాత్కాలిక కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Team India off to Zimbabwe via Emirates flight from Mumbai. 🇮🇳
- Good luck, boys! pic.twitter.com/0yJdocApUX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 1, 2024
సీనియర్లకు విశ్రాంతి
ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్, సూర్యకుమార్, పంత్, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లి, జడేజా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
TEAM INDIA HAS LEFT FOR ZIMBABWE FOR THE T20I SERIES.
- Good luck, Team India. 🇮🇳 pic.twitter.com/iiQUVjlIKA— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024
ఈ సిరీస్‌కు వరల్డ్‌కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు. వరల్డ్‌కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా జట్టులో చోటు దక్కించుకన్నారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం/తెలుగు), మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 5 SD & HD ఛానల్‌లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే
Comments
Please login to add a commentAdd a comment