జులై 6 నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటన.. షెడ్యూల్‌ వివరాలు | India Tour Of Zimbabwe To Start From July 6th, Schedule And Some More Details | Sakshi
Sakshi News home page

జులై 6 నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటన.. షెడ్యూల్‌ వివరాలు

Published Mon, Jul 1 2024 2:00 PM | Last Updated on Mon, Jul 1 2024 3:55 PM

India Tour Of Zimbabwe To Start From July 6th, Schedule And Some More Details

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ముగిసిన వారం రోజుల్లోనే టీమిండియా మరో సిరీస్‌కు సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ నెల (జులై) 6 నుంచి మొదలుకానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్‌, సూర్యకుమార్‌, పంత్‌, అక్షర్‌ పటేల్‌కు విశ్రాంతి కల్పించారు. రోహిత్‌, కోహ్లి, జడేజా రిటైర్మెంట్‌ ప్రకటించారు కాబట్టి వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్‌మన్‌ గిల్‌ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వరల్డ్‌కప్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ప్లేయర్లలోని రింకూ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. 

వరల్డ్‌కప్‌ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబే, సంజూ శాంసన్‌ కూడా ఈ పర్యటనకు ఎంపికయ్యారు. అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, తుషార్‌ దేశ్‌పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్‌ సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 4 (తమిళం/తెలుగు), మరియు  సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 5 SD & HD ఛానల్‌లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబే, అభిషేక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌, దృవ్‌ జురెల్‌, రవి బిష్ణోయ్‌, ఆవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, తుషార్‌ దేశ్‌పాండే

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement