3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా హరారే వేదికగా రేపు (ఆగస్ట్ 18) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ శిఖర్ ధవన్ తమ మ్యాచ్ ప్రణాళికలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు శిఖర్ ధవన్ ప్రదర్శించిన హావభావాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
— Guess Karo (@KuchNahiUkhada) August 16, 2022
ఓ స్థానిక రిపోర్టర్ అడిగిన ప్రశ్న అర్ధం కాక ధవన్ బిక్క మొహంతో ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ రిపోర్టర్ ధవన్‌ను ఏం అడిగాడంటే.. "పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే లాంటి జట్టుతో ఆడటం మీకు ఏ మేరకు లాభిస్తుంది. ఇటీవలికాలంలో జింబాబ్వే మీతో పెద్దగా ఆడింది లేదు. వారిపై గెలవడం సులవునేనని భావిస్తున్నారా?" అని ప్రశ్నించారు.
రిపోర్టర్ తన యాసలో వేగంగా ప్రశ్నించడంతో అయోమయానికి గురైన ధవన్.. బిక్క మొహం పెట్టాడు. ప్రశ్నను మరోసారి రిపీట్ చేయాలని రిపోర్టర్‌ను కోరాడు. ఈ సారి రిపోర్టర్ అడిగిన ప్రశ్నను ఏకాగ్రతతో విన్న ధవన్.. తగు సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.
కాగా, జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు తొలుత శిఖర్ ధవన్‌నే కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అనంతరం కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో అతడికి బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్సీ దూరమైనప్పటికీ ధవన్ ఎంతో హుషారుగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం విశేషం.
చదవండి: కశ్మీర్ లీగ్ ఎఫెక్ట్: హర్షల్ గిబ్స్‌పై వేటు.. గంగూలీపై ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment