IPL 2021: ఆర్సీబీకి షాక్‌.. గాయంతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఔట్ | Washington Sundar Ruled Out Of UAE Leg Of IPL 2021 | Sakshi
Sakshi News home page

IPL 2021 UAE: ఆర్సీబీకి షాక్‌.. గాయంతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఔట్‌

Published Mon, Aug 30 2021 12:22 PM | Last Updated on Mon, Aug 30 2021 12:39 PM

Washington Sundar Ruled Out Of UAE Leg Of IPL 2021 - Sakshi

దుబాయ్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌.. చేతి వేలికి గాయం కారణంగా ఐపీఎల్‌-2021 మలి దశ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆర్సీబీ కీలక ఆటగాళ్లలో ఒకడైన సుందర్‌ సీజన్‌ మొత్తానికి దూరం కావడంతో ఆ జట్టుపై ప్రభావం పడనుంది. సుందర్‌ స్థానంలో బెంగాల్‌ బౌలర్‌ అకాశ్‌దీప్‌కు ఆర్సీబీ యాజమాన్యం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆకాశ్‌దీప్‌ ఆర్సీబీ క్యాంప్‌లో నెట్‌ బౌలర్‌గా ఉన్నాడు. కాగా, సుందర్‌ ఇదే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లండ్‌ పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా ఐపీఎల్‌ మలి దశ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు దుబయ్‌ చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఆర్సీబీ జట్టు యూఏఈకి ఇంకా బయల్దేరాల్సి ఉంది. ఆర్సీబీ రెండో దశ షెడ్యూల్‌లో సెప్టెంబర్‌ 20న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. 
చదవండి: చెలరేగిన యశస్వి జైస్వాల్‌.. ఓమన్‌పై ముంబై విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement